Sri Krishna: శ్రీకృష్ణ పాత్రల్లో నందమూరి హీరోల రికార్డు..

Sri Krishna | రాముడి వేషం విషయంలో రికార్డు క్రియేట్ చేసిన నందమూరి నాయకులు..శ్రీకృష్ణుడి వేషధారణలో కూడా అరుదైన రికార్డును నెలకొల్పారు.

news18-telugu
Updated: August 23, 2019, 4:31 PM IST
Sri Krishna: శ్రీకృష్ణ పాత్రల్లో నందమూరి హీరోల రికార్డు..
నందమూరి శ్రీకృష్ణులు (Twitter/Photos)
news18-telugu
Updated: August 23, 2019, 4:31 PM IST
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో ఒక పాట ఉంది. అందులో నాటి రాముడి రూపం మాకు మాత్రం సొంతం’ అంటూ ఒక పాట పల్లవి ఉంటుంది. రాముడి వేషం విషయంలో రికార్డు క్రియేట్ చేసిన నందమూరి నాయకులు..శ్రీకృష్ణుడి వేషధారణలో కూడా అరుదైన రికార్డును నెలకొల్పారు. నందమూరి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, నాల్గో తరానికి చెందిన మాస్టర్ ఎన్టీఆర్  ఈ నలుగురు కథానాయకులు  శ్రీకృష్ణుడి వేషధారణతో ఆడియన్స్‌ను మెప్పించడం విశేషం.ఇక తెలుగు ఆడియన్స్‌కు శ్రీకృష్ణుడు అంటే ముందుగా గుర్తొచ్చే రూపం రామారావుదే. ఆ తరువాత ఎంతో మంది ఆ పాత్రను పోషించిన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రీకృష్ణుడంటే తెలుగు ప్రజలకు తారకరాముడే గుర్తుకువస్తాడు. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఎలాగో...భగద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఎలా వున్నాయో...ఎన్టీఆర్ కూడా ఆయన సినీ ప్రస్థానంలో పద్దెనిమిది సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు.ఎన్టీఆర్ మొట్ట మొదటగా శ్రీకృష్ణుడిగా వేషం కట్టిన సినిమా ‘మాయా బజార్’. కానీ 1953లో విడుదలైన ‘ఇద్దరు పెళ్ళాలు’ సినిమాలో రామారావు మూడు పదుల వయసలో ఓ స్వప్న గీతంలో తెలుగుతెరపై కృష్ణుడిగా తొలిసారి కనివిందు చేశారు.

శ్రీకృష్షుడిగా ఎన్టీఆర్( ఫేస్‌బుక్ ఫోటో)


గతేడాది రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణ కూడా.‘శ్రీకృష్ణావతారం’ మూవీలో  బాలకృష్ణుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం విశేషం. దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా వారసత్వంతో వెండితెరకు పరిచయమైన నటుడిగా హరికృష్ణ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మూవీలో చిన్నప్పటి శ్రీకృష్ణుడి వేషధారణలో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. మొదటి సినిమా అయిన తనదైన ఆహార్యంతో ఆకట్టుకున్నాడు.


శ్రీకృష్ణావతారంలో కృష్ణుడిగా హరికృష్ణ (యూట్యూబ్ క్రెడిట్)




మరోవైపు నందమూరి రెండో నటవారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ...తండ్రి ఎన్టీఆర్ పౌరాణిక వారసత్వాన్ని కూడా కంటిన్యూ చేశాడు. ఈ బాలకృష్ణుడు కూడా ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించాడు.  అంతేకాదు ‘మంగమ్మ గారి మనవడు’, ‘పట్టాభిషేకం’ వంటి సాంఘిక చిత్రాల్లో వచ్చిన పాటల్లో వేణుగాన లోలుడిగా గెస్ట్ అప్పీరియన్స్‌ ఇచ్చాడు.

శ్రీకృష్ణుడిగా బాలకృష్ణ (ఫేస్‌బుక్ ఫోటో)


అటు బృందావనంలో జూనియర్ ఎన్టీఆర్ మోడ్రన్ శ్రీకృష్ణుడి తరహా పాత్రను పోషించాడు. కానీ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం’లో మాత్రం శ్రీకృష్ణుడి పాత్ర కోసం ఆల్రెడీ ఎన్టీఆర్‌ను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. అంటే ఎన్టీఆర్‌ను తొందర్లనే శ్రీకృష్ణుడి గెటప్‌లో చూడొచ్చన్నమాట.
Loading...
రాజమౌళి ‘మహా భారతం’లో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ?


మరోవైపు నందమూరి నాల్గో తరం నుంచి  అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించడం విశేషం

‘దాన వీర శూర కర్ణ’లో మాస్టర్ ఎన్టీఆర్ (Youtube/Photo)


ఈ రకంగా తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించిన హీరోల్లో నందమూరి హీరోలకు ప్రత్యేక స్థానం ఉంది.

 
First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...