NANDAMURI CHAITANYAKRISHNA WHO IS BEING INTRODUCED AS A HERO FROM THE NTR FAMILY SNR
NTR| NANDAMURI FAMILY: ఇండస్ట్రీలోకి మరో నందమూరి నటవారసుడు .. ఎంట్రీ కాదు రీఎంట్రీ
(నందమూరి నట వారసుడు)
Tollywood|NTR:తెలుగు చిత్రపరిశ్రమలోకి మరో నటవారసుడు అడుగుపెడుతున్నాడు. నందమూరి ఫ్యామిలీకి చెందిన చైతన్యకృష్ణ హీరోగా పరిచయం చేస్తూ సీనియర్ ఎన్టీఆర్ పెద్దకుమారుడు సొంత బ్యానర్లో సినిమా తీస్తున్నారు. ఈసినిమా ఫస్ట్ లుక్‌ని నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు.
స్వర్గీయ మహానటుడు నందమూరి తారకరామారావు(NTR) నటవారసులుగా ఇప్పటికే చాలా మంది సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న వారిలో కొందరు సక్సెస్ఫుల్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా నందమూరి(Nandamuri)ఫ్యామలీ నుంచి మరో నటుడు సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. ఇది అతనికి రీఎంట్రీ అయినప్పటికి గతంలో ప్రేక్షకుల హృదయాల్లో సరైన గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి చైతన్యకృష్ణ(Chaitanyakrishna)హీరోగా పరిచయమవుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్(First look)ని నందమూరి బాలకృష్ణ(Balakrishna)రిలీజ్ చేశారు. చైతన్యకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ పెద్దకుమారుడు నందమూరి జయకృష్ణ (Nandamuri Jayakrishna)కొడుకని..మా నాన్నగారైన నందమూరి తారకరామారావుకి ముద్దుల మనవడని బాలయ్య పరిచయం చేశారు.
నందమూరి ఫ్యామిలీ నుంచి మరొకరు..
తెలుగు చిత్రపరిశ్రమలో ఓ నటసార్యభౌముడిగా పేరు సంపాధించుకున్న నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో చైతన్యకృష్ణను హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తున్న సంస్థ కూడా వారిదే కావడం మరో విశేషం. ఎన్టీఆర్ పెద్దకుమారుడు జయకృష్ష బసవతారకం క్రియేషన్స్ బ్యానర్లో ఈసినిమా నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాని ప్రొడక్షన్ నెంబర్1 బ్యానర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ తన సోదరుడు జయకృష్ణ నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. తప్పకుండా ఈ బ్యానర్ నుంచి మంచి సినిమాలు వస్తాయని..తన మరో సోదరుడు రామకృష్ణ హార్టీ కల్చరల్ బ్యానర్‌తో పాటు కల్యాణ్‌రామ్ స్థాపించిన బ్యానర్లాగానే ఇది సక్సెస్ కావాలని ఆకాంక్షించారు బాలయ్య.
(నందమూరి నట వారసుడు)
రీ ఎంట్రీ ఎలా ఉంటుందో..
నందమూరి చైతన్యకృష్ణ కృష్ణ హీరోగా వస్తున్న ప్రొడక్షన్ నెంబర్1 మూవీకి వంశీ ఆకెళ్ల డైరెక్షన్ చేస్తున్నాడు. గతంలో జక్కన్న, రక్షణ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు వంశీ. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు బాలయ్య. తన తండ్రి జయంతి సందర్భంగా తనకు తండ్రి సమానులైన అన్నయ్య జయకృష్ణ కొడుకు హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందన్న బాలకృష్ణ. కృషి, పట్టుదలతో శ్రమిస్తే గుర్తింపు లభిస్తుందన్నారు.
— sailendra medarametla (@sailendramedar2) May 28, 2022
నందమూరి బిడ్డ నిలబడేనా..
ప్రస్తుతం హీరోగా పరిచయమైన నందమూరి చైతన్యకృష్ణ గతంలో పలు సినిమాల్లో యాక్ట్ చేశాడు. సీనియర్ నటి రాధిక రాడాన్ మీడియా ద్వారా నిర్మించిన ‘ధమ్’అనే మూవీలో హీరోగా యాక్ట్ చేశాడు. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ తర్వాత బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఇప్పటికే నందమూరి నట కుటుంబం నుంచి మూడో తరం వారసులు సినిమాలు చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చైతన్యకృష్ణను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.