HOME »NEWS »MOVIE »nandamuri chaitanya krishna wedding done in a grand manner and balakrishna chandrababu naidu came pk

Nandamuri Chaitanya Krishna: నందమూరి కుటుంబంలో సందడి.. ఘనంగా ఎన్టీఆర్ మనవడి పెళ్లి..

Nandamuri Chaitanya Krishna: నందమూరి కుటుంబంలో సందడి.. ఘనంగా ఎన్టీఆర్ మనవడి పెళ్లి..
నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి (nandamuri chaitanya krishna wedding)

Nandamuri Chaitanya Krishna: తెలుగు ఇండస్ట్రీలో వరసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అన్ని కుటుంబాల్లో కూడా ఇప్పుడు వివాహ వేడుకలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు కాజల్.. ఆ తర్వాత నిహారిక పెళ్లి వేడుక జరిగింది. ఇప్పటికీ మీడియా అంతా ఈ పెళ్లి..

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో వరసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అన్ని కుటుంబాల్లో కూడా ఇప్పుడు వివాహ వేడుకలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు కాజల్.. ఆ తర్వాత నిహారిక పెళ్లి వేడుక జరిగింది. ఇప్పటికీ మీడియా అంతా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మరో కుటుంబంలో కూడా పెళ్లి బాజాలు మోగాయి. నందమూరి కుటుంబంలో కూడా పెళ్లి సందడి కనిపిస్తుంది. కాకపోతే కోవిడ్ సందర్భంగా అస్సలు విషయం బయటికి రానివ్వలేదు నందమూరి కుటుంబ సభ్యులు. కేవలం సన్నిహితుల సమక్షంలోనే కార్యక్రమం పూర్తి చేసారు. నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ వివాహ వేడుక డిసెంబర్ 18న హైదరాబాద్‌లోనే అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బాలయ్య వచ్చి అబ్బాయిని ఆశీర్వదించాడు. అయితే ఈ విషయాన్ని మీడియాలో ఎక్కువగా హైలైట్ చేయలేదు.. నిజానికి నందమూరి కుటుంబ సభ్యులే ఈ పెళ్లి సందడి లేకుండా జరిపించేసారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగానే జరిగినా బయట మాత్రం ఎక్కువగా సందడి కనిపించలేదు.

nandamuri chaitanya krishna engagement,nandamuri balakrishna,nandamuri chaitanya krishna,nandamuri chaitanya krishna wedding,nandamuri chaitanya krishna fires on ap cm ys jagan,nandamuri chaitanya krishna marriage,nandamuri mokshagna in chaitanya krishna engagement,నందమూరి చైతన్య కృష్ణ ఎంగేజ్‌మెంట్,నందమూరి చైతన్య కృష్ణ నిశ్చితార్థం బాలకృష్ణ
నందమూరి చైతన్య కృష్ణ నిశ్చితార్థం (nandamuri chaitanya krishna)




చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాడు. ఆయనతో పాటు బాలయ్య కూతుళ్లు కూడా వచ్చారు. చైతన్య కృష్ణ నటుడిగా కూడా ఓ సినిమా చేసాడు. దాదాపు 17 ఏళ్ల కింద జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్ సినిమా గుర్తుందా.. అందులో మరో హీరోగా నటించాడు చైతన్య. అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీ వైపు చూడలేదు ఈయన. తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. మధ్యలో రాజకీయాల్లో కూడా కనిపించాడు.

నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి (nandamuri chaitanya krishna wedding)


ఆ మధ్య వల్లభనేని వంశీ, కొడాలి నానిపై విరుచుకుపడ్డాడు చైతన్య కృష్ణ. మీరు ఏం మాట్లాడినా చూస్తూ కూర్చోడానికి ఇక్కడ గాజులు తొడుక్కుని ఎవరూ లేరంటూ డైలాగులు కూడా చెప్పాడు చైతన్య కృష్ణ. ఇప్పుడు ఈయన ఓ ఇంటివాడు అయ్యాడు. కుటుంబంలో కొన్నేళ్లుగా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పటికీ కుదరడంతో ఘనంగా జరిపారు నందమూరి కుటుంబ సభ్యులు. అన్నయ్య పెళ్లి వేడుకలో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఈయన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:December 19, 2020, 14:46 IST

टॉप स्टोरीज