Home /News /movies /

NANDAMURI BLAKRISHNA SPLITS ON SENIOR ACTOR KOTA SRINIVASA RAO FACE AND HERE THE BEHIND STORY PK

Balakrishna - Kota Srinivasa Rao: నమస్కారం పెడితే కాండ్రించి మొహాన ఉమ్మేసాడు.. బాలయ్యపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..

బాలయ్య కోట శ్రీనివాసరావు (Balakrishna Kota Srinivasa Rao)

బాలయ్య కోట శ్రీనివాసరావు (Balakrishna Kota Srinivasa Rao)

Balakrishna - Kota Srinivasa Rao: బాలయ్య (Balakrishna - Kota Srinivasa Rao) ఎలా ఉంటాడు.. షూటింగ్‌లో ఎలా బిహేవ్ చేస్తాడనే విషయాలపై చాలా సార్లు కథనాలు వచ్చాయి. ఆయనకు కోపం ఎక్కువ అని చాలా మంది చెప్తుంటారు. ఒక్కోసారి కొడతాడనే వార్తలు కూడా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
బాలయ్య ఎలా ఉంటాడు.. షూటింగ్‌లో ఎలా బిహేవ్ చేస్తాడనే విషయాలపై చాలా సార్లు కథనాలు వచ్చాయి. ఆయనకు కోపం ఎక్కువ అని చాలా మంది చెప్తుంటారు. ఒక్కోసారి కొడతాడనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే బాలయ్యను సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు ఇందులో. ఏం చేసినా కూడా మా బాలయ్య బంగారం అంటుంటారు. అయితే ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు సంచలన నిజాలు బయటపెట్టాడు. తనకు బాలయ్యతో ఎదురైన దారుణమైన సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధ పడ్డాడు. బాలయ్య యాటిట్యూడ్ కారణంగా కోట ఎంతలా ఇబ్బంది పడ్డాడనే విషయంపై కూడా చెప్పుకొచ్చాడు కోట. అప్పట్లో ఈయన మండలాదీశుడు అనే సినిమా చేసాడు కోట శ్రీనివాసరావు. అది అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. అందులో ఎన్టీఆర్ పాత్రలో నటించాడు కోట.

ఆ సినిమా విడుదలైన తర్వాత కోటను ఎక్కడ బయట కనిపించినా కూడా ఎన్టీఆర్ అభిమానులు టార్గెట్ చేసే వాళ్లు. కొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఆయన బయటికి వస్తే పోలీసుల సెక్యూరిటీ పెట్టుకుని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ తిప్పలన్నీ ఎందుకుని నేరుగా అన్నగారినే కలవడానికి కోట చాలా సార్లు ప్రయత్నించాడు కూడా. ఇలాగే ఓ సారి రాజమండ్రిలో కోటకు బాలయ్య ఎదురయ్యాడు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆయన వచ్చాడు.. అలాగే జంధ్యాల షూటింగ్ కోసం కోట వచ్చాడు.
kota srinivasa rao,kota srinivasa rao interview,kota srinivasa rao latest interview,kota srinivasa rao balakrishna,kota srinivasa rao balakrishna interview,kota srinivasa rao about balakrishna,balakrishna splits on kota srinivasa rao face,telugu cinema,బాలకృష్ణ,కోట శ్రీనివాస రావు,కోట మొహంపై ఉమ్మేసిన బాలకృష్ణ
సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao)

లిఫ్ట్ దగ్గర బాలయ్య ఎదురుపడే సరికి.. అక్కడే ఉన్న పరుచూరి బ్రదర్స్ కోటను చూసి పక్కకు తప్పుకోమని సైగలు చేసారు. అయితే అది కోటకు అర్థం కాలేదు. అంతలోనే బాలకృష్ణ ఎదురొచ్చాడు. దాంతో గౌరవంగా నమస్కారం బాబు అన్నాడు కోట. కానీ కాండ్రించి మొహం మీద ఉమ్మేసి వెళ్లిపోయాడు బాలయ్య. ఇదంతా చెప్పింది కూడా ఎవరో కాదు.. స్వయంగా కోట శ్రీనివాసరావు. తనకు జరిగిన ఈ ఘోరమైన అవమానాన్ని బయటపెట్టాడు కోట. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు ఈ సీనియర్ నటుడు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కొడుకు.. మనమేం చేస్తాం.. తండ్రిని అంటే కోపం వస్తుంది కదా అని సరిపెట్టుకున్నానంటూ చెప్పుకొచ్చాడు కోట శ్రీనివాస రావు.

ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో మండలాధీశుడు అనే సినిమా చేసాడు కోట. అందులో రామారావు వేషం వేసేసరికి అసలు కాంట్రవర్సీ మొదలైంది. బాలయ్య తన మొహంపై ఉమ్మేయడం మాత్రమే కాదు.. జీవితంలో అలాంటి చేదు జ్ఞాపకాలు తనకు చాలానే ఉన్నాయని.. జీవితం అంటేనే అదంటూ నిట్టూర్చాడు కోట. ఇంత జరిగినా ఎన్టీఆర్ మాత్రం తనను భుజం తట్టి మెచ్చుకున్నారని.. బాలయ్య మాత్రం ముఖంపై ఉమ్మేశాడని చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ నటుడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kota Srinivasa Rao, Nandamuri balakrishna, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు