• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NANDAMURI BLAKRISHNA PHONE CALL TO FAN BALLARI BALAYYA HOUSE WHO DIED RECENTLY WITH ILLNESS PK

Balakrishna: మా బాలయ్య బంగారం.. చనిపోయిన అభిమాని కుటుంబానికి నేనున్నానంటూ భరోసా..!

Balakrishna: మా బాలయ్య బంగారం.. చనిపోయిన అభిమాని కుటుంబానికి నేనున్నానంటూ భరోసా..!

బాలయ్యతో దివంగత భళ్లారి బాలయ్య (Balakrishna)

Balakrishna: బాలయ్యకు కోపం ఎక్కువ అంటారు.. అభిమానులను కొడతాడంటారు.. కానీ ఆయనలో మరో మనిషి కూడా ఉన్నాడు. అది ఆయన్ని దగ్గర్నుంచి చూసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. తాజాగా తన అభిమాని ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు బాలయ్య(Balakrishna).

  • Share this:
బాలయ్యకు కోపం ఎక్కువ అంటారు.. అభిమానులను కొడతాడంటారు.. కానీ ఆయనలో మరో మనిషి కూడా ఉన్నాడు. అది ఆయన్ని దగ్గర్నుంచి చూసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. తన వాళ్ల కోసం బాలయ్య ఎంత తపన పడతాడు.. తన వాళ్లు అనుకుంటే ఎంత దూరం వెళ్తాడు అనేది ఆయన సన్నిహితులను అడిగితే చెప్తారు. ఇదివరకే ఎన్నోసార్లు అభిమానులకు అండగా ఉన్నారు బాలయ్య. ఆ మధ్య ఓ అభిమానికి కరోనా వస్తే స్వయంగా తానే ఫోన్ చేసి మరీ పలకరించారు. ఆయన ఒకచోట.. తల్లిదండ్రులు ఒకచోట.. పిల్లలు ఒకచోట ఉన్నారు. దాంతో ఆ అభిమాని గురించి తెలుసుకున్న బాలయ్య ప్రత్యేకంగా ఫోన్ చేసారు. చేసి ధైర్యం చెప్పాడు.. తానున్నానని ఎలాంటి అధైర్యపడొద్దని.. అవసరం అయితే ఎవరితో అయినా మాట్లాడి నీకు నయం చేయిస్తానని భరోసా ఇచ్చారు బాలయ్య. దాంతో అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొన్నటికి మొన్న ఓ అభిమాని పెళ్లి జరిగితే కరోనా సమయంలో రావడం కుదరదని.. ఫోన్ చేసి మరీ విష్ చేసారు బాలయ్య. ఇప్పుడు బాలయ్య వీరాభిమాని భళ్లారీ బాలయ్య అనారోగ్యంతో కన్నుమూసారు. 50 ఏళ్ళ వయసున్న భళ్లారీ బాలయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

పరిస్థితి విషమించడంతో ఎప్రిల్ 26న ఈయన మరణించారు. విషయం తెలుసుకున్న బాలయ్య వెంటనే ఆ కుటుంబానికి ఫోన్ చేసారు. అధైర్యపడొద్దు.. తానున్నాను అనే భరోసా కల్పించారు. మీ నాన్నగారంటే నాకు చాలా యిష్టం..
ఆయన శివైక్యం అయ్యారని తెలిసి చలించిపోయానమ్మా.. దేవుడు చాలా అన్యాయం చేసాడు అంటూ ఆయన కొడుకుతో మాట్లాడారు బాలయ్య. అమ్మ వాళ్లు జాగ్రత్త అంటూ ఆ కుటుంబంలోని మగపిల్లాడికి ధైర్యం చెప్పారు బాలయ్య. అలాగే కుటుంబ యోగ క్షేమాల గురించి కనుక్కొన్నారు. ఇప్పుడు నువ్వే కుటుంబానికి దిక్కు.. నువ్వు ధైర్యంగా ఉండు.. అమ్మను బాగా చూసుకో అంటూ ఆ అబ్బాయికి చెప్పారు బాలయ్య.

మీ లాంటి పెద్ద వాళ్లు ఫోన్ చేయడం ఆనందంగా ఉందంటూ ఆ కుర్రాడు అంటే.. ఎవరు పెద్ద ఎవరు చిన్నా అంటూ చెప్పారు బాలయ్య. అందరం ఒకటే అని.. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఈ ఫోన్ కాల్ వాయిస్ విన్న తర్వాత బాలయ్య అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇది మా హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన అఖండ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమా లైన్‌లో ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published: