టాలీవుడ్ సీనియర్ హీరోగా సూపర్ ఫామ్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). అఖండ (Akhanda) సినిమా రూపంలో ఇండస్ట్రీకి భారీ హిట్ అందించి అదే జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే అదే బాలయ్య ఇప్పుడు ప్రొడ్యూసర్ (Producer) అవతారం ఎత్తబోతున్నారు. బసవ తారకరామ క్రియేషన్స్ (Basavatarakarama Creations) అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగా సినీ బిజినెస్ రంగంలోకి వస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేసిన బాలయ్య బాబు.. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ బ్యానర్‌పై రాబోతున్న తొలి సినిమా (First Movie) ప్రకటించనున్నారట. ఇది తెలిసి నందమూరి అభిమానుల్లో క్యూరియాసిటీ మొదలైంది. అంతేకాదు అందరి కన్ను నందమూరి మోక్షజ్ఞపై పడింది.
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ప్రాజెక్టు ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీలో తన పాత్ర మెయిన్ అని ఇదివరకే ప్రకటించిన బాలయ్య.. మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వల్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. దీంతో బాలకృష్ణ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోతున్న మొదటి సినిమా ఇదే అయి ఉండొచ్చు అనే ఊహాగానాలు షురూ అయ్యాయి. ఎన్టీఆర్ జయంతి నందమూరి అభిమానులకు బాలకృష్ణ ఈ గుడ్ న్యూస్ చెబుతారని అంతా భావిస్తున్నారు.
రీసెంట్‌గా బాలకృష్ణ ఫ్యామిలీ ఫొటో ఒకటి వైరల్ కాగా అందులో బాలయ్య బాబుతో పాటు ఆయన సతీమణి వసుంధర దేవి, పెద్ద కుమార్తె నారా బ్రహ్మణి, కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ ఉన్నారు. మోక్షజ్ఞ ఫిట్నెస్, లుక్ చూసి ఆయన సినీ ఎంట్రీపై డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇంతలో తాజాగా బాలకృష్ణ నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకటన అని తెలియడంతో మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఈ సినిమా పనులు చకచకా కంప్లీట్ చేస్తూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది ఫినిష్ కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలకృష్ణ. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇందులో బాలయ్య బాబు కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించనుందని, మెయిన్ హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బాలయ్య ప్రొడక్షన్ హౌస్ తాలూకు మ్యాటర్ బయటకు రావడం నందమూరి అభిమానులను మరింత హుషారెత్తిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nandamuri balakrishna, Nandamuri Mokshagna, నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ