NANDAMURI BALAKRISHNA WEIGHT LOSS UPTO 10KGS FOR KS RAVIKUMAR MOVIE TA
కొత్త సినిమా కోసం బాలకృష్ణ చేసిన పనికి ఆశ్యర్యపోతున్న ఫ్యాన్స్.. ..
బాలయ్య న్యూ లుక్ (Source: Twitter)
ఎక్కడ నెగ్గడమో కాదు.. ఎక్కడ తగ్గాలో హీరో బాలకృష్ణకు బాగా తెలుసు. ఇపుడు ఇదే సూత్రాన్ని ఇపుడు కే.యస్.రవికుమార్ సినిమ ా కోసం అప్లై చేసాడు బాలయ్య. వివరాల్లోకి వెళితే..
ఎక్కడ నెగ్గడమో కాదు.. ఎక్కడ తగ్గాలో హీరో బాలకృష్ణకు బాగా తెలుసు. ఇపుడు ఇదే సూత్రాన్ని ఇపుడు కే.యస్.రవికుమార్ సినిమ ా కోసం అప్లై చేసాడు బాలయ్య. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం స్టైలిష్ లుక్‌లో మారడం కోసం బాలయ్య ఏకంగా 11 కిలోల బరువు తగ్గినట్టు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించాడు. కే.యస్.రవికుమార్ సినిమా తర్వాత బోయపాటి శ్రీను బాలయ్యతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆ క్యారెక్టర్ కోసం బాలయ్యను బరువు తగ్గమని తాను కోరినట్టు తెలిపాడు. అలా బరువు తగ్గిన ఈ సినిమాలో చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నట్టు తెలిపారు.
NBK 105 మూవీలో కొత్త లుక్
ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ లుక్ వెనక రీజన్ కూడా ఉంది. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ ఒకే మూసలో అదే ఆహార్యంతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మధ్యలో గౌతమిపుత్ర శాతకర్ణి, పైసావసూల్ సినిమాల్లో మాత్రం కాస్తంత డిఫరెంట్‌గా కనపబడ్డాడు.ఇప్పటికే విడుదల చేసిన లుక్ చూస్తుంటే ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ అని చెప్పొచ్చు. గ్యాంగ్‌స్టర్‌గా బాలకృష్ణ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు బాలయ్య సరసన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ వస్తోన్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి..
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.