ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమా లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీపావళి కానుకగా మరో అప్టేట్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమా టైటిల్ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించిక పోయినా.. జెమినీ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ రూలర్ అంటూ ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ దీపావళి కానుకగా ‘రూలర్’ టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Bhumika, C.Kalyan, K. S. Ravikumar, NBK 105, Sonal chauhan, Telugu Cinema, Tollywood