వాళ్లకు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే సహించేది లేదంటున్న ‘రూలర్’..

నందమూరి బాలకృష్ణ మరోసారి పైరసీ గాళ్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన హీరోగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రూలర్’ సినిమా ఈ శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతుంది.

news18-telugu
Updated: December 23, 2019, 8:36 AM IST
వాళ్లకు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే సహించేది లేదంటున్న ‘రూలర్’..
నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
నందమూరి బాలకృష్ణ మరోసారి పైరసీ గాళ్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన హీరోగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రూలర్’ సినిమా ఈ శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పైరసీ గాళ్లు బాలయ్య గట్టి వార్నింగ్ ఇచ్చారు. నిర్మాతలు, దర్శకులు ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాను పైరసీ చేయడం దారుణం అన్నారు. ఈ సినిమాను నిర్మాత 4 K రెజల్యూషన్‌తో నిర్మించారు. అలా సినిమా వాళ్ల కష్టాన్ని పైరసీ గాళ్లు.. బూడిద పాలు చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే పైరసీ నియంత్రణకు ప్రభుత్వాలు చాలా మటుకు చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు కూడా తమవంతు బాధ్యతగా సహయ సహాకారాలు అందించి పైరసీని ప్రోత్సహించకుండా కంట్రోల్ చేయాలనున్నారు.  ప్రేక్షకులు ఎవరైనా ఏ సినిమానైనా థియేటర్స్‌లో చూసి ఆనందించడని అలా చూస్తేనే ఆ అనుభూతి పొందుతారని బాలయ్య పేర్కొన్నారు. ఈ సక్సెస్ మీట్‌కు బాలయ్యతో పాటు చిత్ర నిర్మాత సి.కళ్యాణ్, హీరోయిన్ వేదికతో పాటు చిత్రంలో నటించిన నటీనటులు హాజరయ్యారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 23, 2019, 8:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading