జగన్‌ను టార్గెట్ చేసిన బాలయ్య.. రూలర్ ట్రైలర్‌లో కౌంటర్స్..

బాలయ్య సినిమా చేస్తున్నాడంటే చాలు వద్దన్నా కూడా కొందరికి సెటైర్లు పడుతూనే ఉంటాయి. రాజకీయంగా కూడా ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా సంచలన సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 8:28 PM IST
జగన్‌ను టార్గెట్ చేసిన బాలయ్య.. రూలర్ ట్రైలర్‌లో కౌంటర్స్..
తాజాగా జగన్ తన అభిమాని అనే అంశంపై బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు.
  • Share this:
బాలయ్య సినిమా చేస్తున్నాడంటే చాలు వద్దన్నా కూడా కొందరికి సెటైర్లు పడుతూనే ఉంటాయి. రాజకీయంగా కూడా ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా సంచలన సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రూలర్ కొత్త ట్రైలర్‌లో మరోసారి రెచ్చిపోయాడు బాలయ్య. కొత్త ట్రైలర్ చూస్తుంటే వైసీపీ నేతలకు భారీగా సెటైర్లు పడినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేసాడు బాలయ్య. పదవి అంటే నువ్వు చదివిని డిగ్రీ అనుకుంటున్నావా.. చచ్చేవరకు నీ వెంట రావడానికి.. ఎలక్షన్ ఎలక్షన్‌కు పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు అంటూ విలన్‌తో అదిరిపోయే డైలాగ్ చెప్పాడు బాలకృష్ణ. దాంతో పాటే రాజకీయంగా కూడా మరిన్ని డైలాగులతో రెచ్చిపోయాడు.
Nandamuri Balakrishna sensational satires on AP CM Jagan in his new movie Ruler movie new trailer pk బాలయ్య సినిమా చేస్తున్నాడంటే చాలు వద్దన్నా కూడా కొందరికి సెటైర్లు పడుతూనే ఉంటాయి. రాజకీయంగా కూడా ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా సంచలన సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ruler pre release event,ruler movie pre release event,ruler movie new trailer,ys jagan,ys jagan twitter,ys jagan instagram,balakrishna satires on ys jagan,ys jagan balakrishna,ys jagan fan of balayya,balakrishna twitter,ap cm ys jagan,ys jagan balakrishna relationship,ap news,ap politics,balakrishna,balakrishna about ys jagan,ys jagan balakrishna fan,ys jagan is balakrishna fan,ys jagan about balakrishna,ys jagan fan of balakrishna,ys jagan mohan reddy balakrishna fan,ys jagan die hard fan of balakrishna,nandamuri balakrishna,ys jagan vs balakrishna,ys jagan speech,ys jagan mohan reddy,ys jagan balayya fan,ys jagan praises balakrishna,jagan as a fan of balakrishna,telugu cinema,vijay chander balakrishna ys jagan,వైఎస్ జగన్,ఏపీ సీఎం వైఎస్ జగన్,వైఎస్ జగన్ బాలకృష్ణ,బాలయ్యకు జగన్ ఫ్యాన్,తెలుగు సినిమా
‘రూలర్’లో బాలకృష్ణ (Twitter/Photo)

ఇవన్నీ చూస్తుంటే జగన్‌ను బాగానే టార్గెట్ చేసినట్లు అర్థమైపోతుంది. మరోవైపు సినిమాలో మద్యపానం గురించి కూడా కొన్ని డైలాగులున్నాయి. గ్లోబ్‌ను గోలీలా చుట్టి ప్రపంచంతో ఆడుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా నీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా అంటూ మరో పవర్ ఫుల్ డైలాగ్ కూడా వేసాడు బాలకృష్ణ. ఈ మధ్య ఏపీలో మద్యపానం గురించి చాలా చర్చలే జరుగుతున్నాయి. దానిపై పరోక్షంగా ఇందులో బాలయ్య సెటైర్లు వేసాడని తెలుస్తుంది. గతంలో జగన్ జైల్లో ఉన్నపుడే సిబిఐ ఎంక్వైరీ అంటూ లయన్ సినిమాలో నానా రచ్చ చేసాడు బాలయ్య. ఇప్పుడు మళ్లీ రూలర్ ట్రైలర్ కూడా పొలిటికల్ సెటైర్లతో నిండిపోయింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో..? డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. కేయస్ రవికుమార్ దర్శకుడు.. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటించారు.
First published: December 14, 2019, 8:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading