Ruler Pre Release | బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్...

డిసెంబర్ 14న విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్స్, ఉడా పార్క్‌లో సాయంత్రం 5 గంటల నుంచి రూలర్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. అని సినీ నిర్మాణ సంస్థ సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది.

news18-telugu
Updated: December 5, 2019, 7:35 PM IST
Ruler Pre Release | బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్...
నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమా స్టిల్
  • Share this:
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రూలర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు డైట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ అయింది. ఈనెల 14వ తేదీన విశాఖలో భారీగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 14న విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్స్, ఉడా పార్క్‌లో సాయంత్రం 5 గంటల నుంచి రూలర్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని సినీ నిర్మాణ సంస్థ సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. నందమూరి బాలయ్య ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ నందమూరి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య మాస్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సినిమా కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>