రూలర్ ట్రైలర్.. ఇది దెబ్బతిన్న సింహంరా.. వెంటాడి వేటాడి చంపుద్ది..

బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు నందమూరి నటసింహం. ఈయన నటిస్తున్న రూలర్ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 8:35 AM IST
రూలర్ ట్రైలర్.. ఇది దెబ్బతిన్న సింహంరా.. వెంటాడి వేటాడి చంపుద్ది..
‘రూలర్’లో బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు నందమూరి నటసింహం. ఈయన నటిస్తున్న రూలర్ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు. జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్‌తో కలిసి ఈయన మరోసారి వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్.. టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో వచ్చాడు నందమూరి హీరో. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్. ముఖ్యంగా ఆయన గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి కిరాక్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు టీజర్‌లో కూడా ఈ గెటప్ హైలైట్ అయింది. మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఈ సీనియర్ హీరో.
Nandamuri Balakrishna Ruler movie trailer released and it will be feast for fans pk బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు నందమూరి నటసింహం. ఈయన నటిస్తున్న రూలర్ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు. ruler trailer,ruler trailer released,ruler trailer talk,balakrishna ruler trailer talk,ruler new look,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,రూలర్ ట్రైలర్,రూలర్ ట్రైలర్ విడుదల,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా,రూలర్ టీజర్ రిలీజ్ టాక్,రూలర్ టీజర్,రూలర్ టీజర్
బాలకృష్ణ,కే.యస్.రవి కుమార్ (Twitter/Photo)

రూలర్ ట్రైలర్ అంతా బాలయ్య ప్రధానంగానే సాగింది. ఆయనపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. రైతుల నేపథ్యంలో ఈ చిత్రం వస్తుందని అర్థమైపోతుంది. రైతులతోనే కథకు ముడిపెట్టాడు దర్శకుడు. అందులోనే రాజకీయాలతో పాటు యాక్షన్ డ్రామాను కూడా మిక్స్ చేసాడు. ఇక ఎమోషనల్ డ్రామా కూడా బాగానే కనిపిస్తుంది. బాలయ్య మరోసారి రెచ్చిపోయాడు.. మాస్ పోలీస్ ఆఫీసర్‌గా పిచ్చెక్కించాడు. నరుకుడు.. కాల్చుడు.. చంపుడు అన్నీ చూపించాడు కేయస్ రవికుమార్. ఫ్యామిలీ డ్రామాను పండిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రప్ఫాడించాడు బాలయ్య. మనం బాలయ్యను బాగా చూసుకుంటే చాలు.. ఆయనే ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను చూసుకుంటాడులే అనే ధైర్యం కేయస్ రవికుమార్‌లో కనిపిస్తుంది. అందుకే కాబోలు బాలయ్యపైనే ట్రైలర్ అంతా కట్ చేసాడు రవికుమార్.


ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధమైపోతున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ రూలర్ సినిమాపైనే ఉన్నాయి. తక్కువ టైమ్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు కేయస్ రవికుమార్. మరోసారి జై సింహా కాంబినేషన్‌లోనే సినిమా వస్తుంది. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ బికినీ అందాలు సినిమాకు బోనస్. పోలీస్ డ్రస్‌తో పాటు మరోవైపు పక్కా సాఫ్ట్ అవతారంలో కూడా రెచ్చిపోయాడు బాలయ్య. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>