బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ..ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెట్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ మూవీలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించారు. భూమిక ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో నటించినట్టు సమాచారం. బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ నిరాశ పరచడంతో ‘రూలర్’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
తాజాగా ‘రూలర్’ సినిమా స్టోరీ ఇదే అని నిర్మాత మీడియాకు రివీల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో బాలకృష్ణ చిత్ర నిర్మాతపై సీరియస్ అయినట్టు సమాచారం. ‘రూలర్’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఈ చిత్రం ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని సినిమా. ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడిన తెలుగు వాళ్ల కథ అని చెప్పుకొచ్చాడు. సెటిలర్స్ సమస్యను నేపథ్యంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారట. ఈ సినిమాలో మరోసారి బాలకృష్ణ నట విశ్వరూపం చూపడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడం ఖాయం అని చెప్పారు నిర్మాత. ఏమైనా ప్రొడ్యూసర్ ఇలా విడుదలకు ముందే సినిమా కథను లీక్ చేయడంపై బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, K. S. Ravikumar, NBK 105, Ruler, Sonal chauhan, Telugu Cinema, Tollywood, Vedika