హోమ్ /వార్తలు /సినిమా /

Ruler Movie Review: నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ మూవీ రివ్యూ..

Ruler Movie Review: నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ మూవీ రివ్యూ..

బాలకృష్ణ ‘రూలర్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

బాలకృష్ణ ‘రూలర్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

ఈ ఇయర్ తన తండ్రి ఎన్టీఆర్ జీవితం మీద తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘రూలర్’. బాలయ్యతో ‘జై సింహా’ వంటి మంచి హిట్ అందించిన కే.యస్.రవికుమార్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘రూలర్’ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

ఇంకా చదవండి ...

నటీనటులు: నందమూరి బాలకృష్ణ,సోనాల్ చౌహాన్,వేదిక,భూమిక,జయసుధ,ప్రకాష్ రాజ్,నాగినీడు,చలపతి రావు  తదితరులు

రన్‌టైమ్: 150.2 నిమిషాలు

మ్యూజిక్ : చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్

నిర్మాత: సి.కళ్యాణ్

దర్శకత్వం: కే.యస్.రవికుమార్

ఈ ఇయర్ తన తండ్రి ఎన్టీఆర్ జీవితం మీద తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘రూలర్’. బాలయ్యతో ‘జై సింహా’ వంటి మంచి హిట్ అందించిన కే.యస్.రవికుమార్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘రూలర్’ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ) దేశంలోనే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్. ఒక ప్రాజెక్ట్ విషయమై ఉత్తర ప్రదేశ్ వెళతాడు. అక్కడ రాజకీయంగా పాతకుపోయినా ఒక పొలిటికల్ లీడర్ దీనికి అడ్డు పడతుంటాడు. ఈ సందర్భంలో యూపీలో అర్జున్ ప్రసాద్ పోలికలతో ధర్మ (బాలకృష్ణ) అనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అసలు ధర్మకు అర్జున్ ప్రసాద్‌ ఉన్న సంబంధమేమిటన్నదే ‘రూలర్’ మూవీ స్టోరీ.

నటీనటుల విషయానికొస్తే.. 

‘రూలర్’ సినిమాలో నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన ఎనర్జీతో మరోసారి అభిమానులను అలరించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ ప్రసాద్‌గా మరోసారి తనదైన ముద్ర వేసాడు. మరోవైపు ధర్మ అనే పోలీస్ అధికారి పాత్రలో రఫ్పాడించాడు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్‌లో రైతు గొప్పతనాన్ని చెప్పే డైలాగులు ప్రేక్షకులను  అలరిస్తాయి.మరోసారి డాన్స్, ఫైట్స్ విషయంలో బాలయ్య ఎనర్జీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. హీరోయిన్స్‌గా నటించిన వేదిక, సోనాల్ చౌహాన్ మాత్రం కేవలం గ్లామర్ షోకే మాత్రమే పరిమితమయ్యారు. పొలిటికల్ లీడర్‌గా నటించిన ప్రకాష్ రాజ్.. విలన్‌గా నటించిన కొత్త నటుడు, భూమిక,నాగినీడు తన పరిధి మేరకు మెప్పించారు. 

టెక్నీషియన్స్ విషయానికొస్తే.. 

దర్శకుడు కే.యస్.రవికుమార్ ‘రూలర్’ వంటి రొటీన్ సినిమా కథతో బాలకృష్ణను ఎలా ఒప్పించడానేదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఏర్పడుతుంది. ఎపుడో 80-90ల్లో తీయాల్సిన స్టోరీని మరోసారి ప్రేక్షకులపై రుద్దాడు దర్శకుడు కేయస్ రవికుమార్.ఈయన పాత పాటర్న్‌లోనే ‘రూలర్’కథన వండి వార్చాడు. కేవలం బాలయ్య అభిమానులను, బీ,సీ సెంటర్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సీన్స్ రాసుకుని బండి లాగించాడు. అంతేకాదు ఈ సినిమా చూస్తుంటే.. బాలకృష్ణ పాత సినిమాలనే అటు ఇటు మార్చి తీసినట్టు ఉంది. బాలయ్య లాంటి కథానాయకుడు దొరికితే.. మంచి స్టోరీతో సినిమా చేయడం పక్కనపెట్టి.. రొటిన్ కథతో  బండి లాగించి సేఫ్ గేమ్ ఆడాడు దర్శకుడు రవికుమార్. యాక్షన్ పార్ట్ మాత్రం మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. మరోవైపు కొరియోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు.పాటలు ఏమంత ఆకట్టుకునేలా లేవు.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు.

ప్లస్

బాలయ్య ఎనర్జిటిక్ నటన

డాన్సులు, ఫైట్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్

రొటీన్ కథ

మ్యూజిక్

హీరోయిన్స్

రేటింగ్: 2.25/5

చివరి మాట: ‘రూలర్’ కేవలం అభిమానులకు మాత్రమే..

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Balakrishna, Bhumika, K. S. Ravikumar, NBK, Ruler, Ruler Movie Review, Sonal chauhan, Telugu Cinema, Tollywood, Vedika

ఉత్తమ కథలు