హోమ్ /వార్తలు /సినిమా /

Ruler: బాలకృష్ణ ‘రూలర్’ మూవీ ఓవర్సీస్ టాక్.. ఎలా ఉందంటే..

Ruler: బాలకృష్ణ ‘రూలర్’ మూవీ ఓవర్సీస్ టాక్.. ఎలా ఉందంటే..

‘రూలర్’ మూవీ (Twitter/Photo)

‘రూలర్’ మూవీ (Twitter/Photo)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఈ రోజే విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఈ రోజే విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదలైంది. అక్కడి టాక్‌ను బట్టి.. ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీ అని చెబుతున్నారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానులను అలరిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో మరోసారి బాలయ్య తన నట విశ్వరూపం చూపించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎసిపోడ్‌లో సన్నివేశాలు ఈ చిత్రానికి కీలకం అని చెబుతున్నారు. కొంచెం రొటిన్ కథే అయినా.. తనదైన శైలిలో కే.యస్.రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెబుతున్నారు. మొత్తానికి  బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ నిరాశ పరచడంతో ‘రూలర్’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మొత్తానికి బీ,సీ, సెంటర్ ఆడియన్స్ బాలయ్య అభిమానులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిన ఈ చిత్రం మిగతా వర్గాలను ఏ మేరకు ఆకట్టుకుంటుందో అనే దానిపై దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

First published:

Tags: Balakrishna, Bhumika, C.Kalyan, K. S. Ravikumar, NBK, Ruler, Ruler Movie Review, Sonal chauhan, Vedika

ఉత్తమ కథలు