బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ..ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెట్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించారు. భూమిక ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో నటించినట్టు సమాచారం. బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ నిరాశ పరచడంతో ‘రూలర్’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రంలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది.
ఇక సెన్సార్ వాళ్లు ‘రూలర్’ సినిమాను చూసి నిర్మాతను అభినందించినట్టు సమాచారం. యాక్షన్ చిత్రమే అయిన ఇందులో సమాజానికి ఉపయోగపడే కొన్ని సన్నివేశాలు ఉన్నట్టు టాక్. అంతేకాదు ఈ చిత్రంలో రైతులతో పాటు కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సెన్సార్ వాళ్లు కదిలించినట్టు చెబుతున్నారు. మొత్తానికి బాలయ్య ‘రూలర్’ మూవీ పేరుకు యాక్షన్ చిత్రమే అయినా.. అన్ని అంశాలను జోడించి తెరకెక్కించినట్టు సెన్సార్ రిపోర్ట్ బట్టి తెలుస్తోంది. మొత్తానికి ‘రూలర్’గా నట సింహం బాక్సాఫీస్ దగ్గర మరోసారి గర్జిస్తాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhumika, C.Kalyan, K. S. Ravikumar, NBK, NBK 105, Ruler, Sonal chauhan, Telugu Cinema, Tollywood, Vedika