బాలకృష్ణ రూలర్ ప్రభంజనం.. ‘అడుగడుగో యాక్షన్ హీరో’..

Ruler : రూలర్ సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగ్‌ వీడియోను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. అడుగడుగో యాక్షన్ హీరో అంటూ సాగే ఈ సాంగ్‌లో బాలయ్య స్టిల్స్ అదిరిపోయేలా ఉన్నాయి.

news18-telugu
Updated: December 1, 2019, 2:39 PM IST
బాలకృష్ణ రూలర్ ప్రభంజనం.. ‘అడుగడుగో యాక్షన్ హీరో’..
బాలకృష్ణ ‘రూలర్’ టీజర్ (twitter/photo)
  • Share this:
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న కొత్త సినిమా రూలర్. ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అందర్ని ఆశ్చర్యపరిచిన బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుమ్ము లేపేందుకు సిద్ధమవుతున్నాడు. కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మువీ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌లో తన స్టామినాను మరోసారి నిరూపించుకున్న నటసింహం.. బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. యాభై ఏళ్లు దాటినా తన హీరోయిజంతో, నటనతో, డైలాగులతో వెండితెరపై రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగ్‌ వీడియోను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. అడుగడుగో యాక్షన్ హీరో అంటూ సాగే ఈ సాంగ్‌లో బాలయ్య స్టిల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వెయిట్ ఉన్న పాత్రలను ఎంచుకొని, నట విశ్వరూపాన్ని చూపే బాలయ్య.. ఈ సాంగ్‌లో యంగ్ హీరోలా కనిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది.

కాగా, ఓ ప్రైవేటు వేడుకలోనూ బాలయ్య అదరగొట్టాడు. హీరో అజిత్ నటించిన తమిళ సినిమా వేదాలంలోని ఫేమస్ సాంగ్ ఆలుమా.. డోలుమా.. సాంగ్‌కి తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అలరించాడు. బాలయ్య డ్యాన్సు చేస్తున్నంత సేపు అక్కడున్నవారంతా ఈలలు వేస్తూ, గోల చేస్తూ ఉండిపోయిన విషయం తెలిసిందే.First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు