నాగబాబు ఇష్యూపై యూట్యూబ్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

నాగబాబు బాలకృష్ణ (naga babu balakrishna)

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలు గురించి తనని పిలవలేదని బాలయ్య చెప్పిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. తాజాగా బాలకృష్ణ.. ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు సహా టాలీవుడ్ విషయాలపై స్పందించారు.

  • Share this:
    కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలు గురించి తనని పిలవలేదని బాలయ్య చెప్పిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ కామెంట్స్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మెగా బ్రదర్.. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ చెప్పిన మాటలు పెను దుమారన్నే రేపాయి. ఈయన కామెంట్స్‌తో మరోసారి నందమూరి, మెగా కంపౌండ్స్ మధ్య ఉన్న వైరం బయటికి వచ్చింది. బయటికి అంతా ఒక్కటే అని చెప్పుకుంటున్నా కూడా లోపల మాత్రం గ్రూపు రాజకీయాలు బాగానే నడుస్తున్నాయని విషయం మరోసారి ప్రూవ్ అయింది. దానికితోడు నీ యిష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరూ లేరు.. మీరు కింగ్ కాదు జస్ట్ హీరో అంతే.. ఎవర్ని ఎప్పుడు ఎక్కడికి పిలవాలో అందరికీ తెలుసు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బాలయ్య తర్వాత టీడీపీపై నాగబాబు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈయన చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులు అస్సలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కానీ తాజాగా బాలకృష్ణ .. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఇష్యూపై స్పందించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ వాళ్లు, తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలపై స్పందించారు. నేను దేనిలో ఇన్వాల్వ్ కాను అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు నాగబాబు ఇష్యూపై స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలపై నేనెమి చెప్పుదలచుకోలేదు. నేను ఎవరికీ భయపడను. నా వ్యక్తితత్వం గురించి భయం లేదు. నాకు ఎవరైనా మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలన్నారు. ఇండస్ట్రీలో ఎవరైనా మమ్మల్ని ఫాలో కావల్సిందే అన్నారు. చరిత్ర సృష్టించాలన్న మేమే .. దాన్ని తిరగరాయాలన్న మేమే అంటూ సింహా సినిమాలోని డైలాగులు చెప్పుకొచ్చారు. అంతకు ముందు అన్ని విషయాల్లో తనకు తండ్రి అలవాట్లే ఉన్నాయన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌కు చుట్ట కాల్చే అలవాటు ఉన్నట్టే తనకు చుట్ట కాల్చడం అలవాటు అయిందన్నారు. బోయపాటి శ్రీను సినిమాలో మరోసారి పాట పాడబోతున్నట్టు చెప్పుకొచ్చారు. మొత్తంగా బాలయ్య.. టాలీవుడ్‌తో పాటు నాగబాబు ఇష్యూపై ఎలా స్పందించాడనే విషయం తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: