బాలకృష్ణ చెప్పినట్లు చేద్దాం.. కరోనాను చంపేద్దాం..

Balakrishna: కంటికి కనబడని కరోనా భూతంతో మనం యుద్ధం చేస్తున్నామని.. భయం వదిలి.. సామాజిక దూరంతో కరోనా చచ్చేవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు నందమూరి నటసింహం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2020, 6:10 PM IST
బాలకృష్ణ చెప్పినట్లు చేద్దాం.. కరోనాను చంపేద్దాం..
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
  • Share this:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌ను అంతమొందించే వ్యాక్సిన్ ఇంకా రాలేదు. మందు లేని ఈ రోగంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ నిర్మూలన సాధ్యమయ్యేలా లేదు కాబట్టి నియంత్రిద్దామంటూ చాలా మంది బయటికి వచ్చి జాగ్రత్తలు చెబుతున్నారు. అందులో సినిమా వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య కూడా ఇదే చేసాడు. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ప్రభుత్వం చెప్పినట్లు చేద్దామంటూ చేతులెత్తి దండం పెట్టి చెప్పాడు బాలయ్య.
బాలకృష్ణ (balakrishna new look)
బాలకృష్ణ (balakrishna new look)


ఈ వైరస్ నివారణ కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ అధికారులు, మీడియా ప్రతినిధులకు నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఇంత మంది కష్టపడి పని చేస్తుంటే.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయని చెప్పాడు ఆయన. ఇలాంటి పొరపాట్లు జరగొద్దని.. దయచేసి అంతా జాగ్రత్తలు పాటించాలంటూ చేతులెత్తి నమస్కరించాడు బాలకృష్ణ. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను నిర్వర్తించాలని కోరుతూ ఈయన వీడియో ఒకటి విడుదల చేసాడు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని ఆయన కోరాడు.

కంటికి కనబడని కరోనా భూతంతో మనం యుద్ధం చేస్తున్నామని.. భయం వదిలి.. సామాజిక దూరంతో కరోనా చచ్చేవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు నందమూరి నటసింహం. కరోనా సర్వ నాశనానికి మన దగ్గర ఉన్న ఒకేఒక్క ఆయుధం సామాజిక దూరం మాత్రమేనని తెలిపాడు బాలయ్య. ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించడమే మనకు రక్ష అని ఆయన చెప్పారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధనలో ఉండి కరోనాను జయించాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నట్టు కోరాడు బాలయ్య. ఇక ఈ కరోనా బాధితుల సహాయార్థం ఆయన 1.25 కోట్లు విరాళంగా ఇచ్చాడు.
Published by: Praveen Kumar Vadla
First published: April 3, 2020, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading