Home /News /movies /

NANDAMURI BALAKRISHNA RARE RECORD IN DUAL ROLES HERE ARE THE DETAILS TA

ఇప్పటి జనరేషన్‌లో బాలయ్య ఈ రికార్డును ఎవరు అందుకోలేరు..

ఫాక్షన్ చిత్రాల ట్రెండ్ సెట్టర్

ఫాక్షన్ చిత్రాల ట్రెండ్ సెట్టర్

అవును ఇప్పటి జనరేషన్‌లో నందమూరి బాలకృష్ణకు ఉన్న రికార్డును ఎవరు అందుకోలేరు. వివరాల్లోకి వెళితే..

    అవును ఇప్పటి జనరేషన్‌లో నందమూరి బాలకృష్ణకు ఉన్న రికార్డును ఎవరు అందుకోలేరు. వివరాల్లోకి వెళితే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. అంతేకాదు దాదాపు 40కి పైగా సినిమాల్లో ఆయన డ్యూయల్‌ రోల్లో నటించి రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత ఏఎన్నార్, కృష్ణ కూడా ఎక్కువ సినిమాల్లో డబుల్‌ రోల్లో నటించిన మెప్పించారు. ఆ తర్వాత జనరేషన్ విషయానికొస్తే..ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించిన రికార్డు బాలకృష్ణ సొంతం. బాలయ్య మొదటి సారి ‘అపూర్వ సహోదరులు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత ‘రాముడు భీముడు’,‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’,‘ఆదిత్య 369’,‘మాతో పెట్టుకోకు’, ‘శ్రీకృష్ణార్జున విజయం’,‘పెద్దన్నయ్య’, ‘సుల్తాన్’,‘చెన్నకేశవ రెడ్డి’,‘అల్లరి పిడుగు’, ‘ఒక్క మగాడు’,‘పాండు రంగడు’, ‘సింహా’,‘పరమవీర చక్ర’, ‘లెజెండ్’వంటి 15 సినిమాల్లో రెండు పాత్రల్లో నటించాడు. అది కాకుండా..‘అధినాయకుడు’లో త్రిపాత్రాభియం చేసాడు. ఈ రకంగా 16 సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నటించిన హీరోగా ఈ జనరేషన్‌లో బాలయ్య రికార్డు నెలకొల్పాడు.

    Tollywood senior hero nandamuri balakrishna again working with directors boyapati srinu and ks ravikumar,తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు .. కొత్త కొత్త డైరెక్టర్స్‌తో సరికొత్త సబ్జెక్ట్‌తో ప్రయోగాలు చేస్తుంటే..సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం ఎపుడు రొటీన్ మాస్ దర్శకులతో పనిచేస్తున్నాడనే టాక్ వినబడుతోంది. తాజాగా మరోసారి బాలయ్య..కే.యస్.రవికుమార్‌కే నెక్ట్స్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు.balakrishna,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,
    బాలకృష్ణ,కే.యస్.రవికుమార్


    తాజాగా బాలకృష్ణ..కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో రెండోసారి యాక్ట్ చేస్తోన్న సినిమాలో కూడా డ్యూయల్‌ రోల్లో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ  రకంగా చూస్తే..బాలకృష్ణ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న 17వ సినిమా అవుతోంది. ఏ రకంగా చూసిన ఇప్పటి జనరేషన్‌లో ఇన్ని సినిమాల్లో డబుల్ రోల్ యాక్ట్ చేసిన హీరో ఎవరు లేరు. అదే చిరంజీవి విషయానికొస్తే..దాదాపు 13 సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేసారు. ఏమైనా ఇప్పటి తరంలో ఏ హీరో కూడా ఈ అంకెను అందుకోవడం అంత సులభం కాదనే చెప్పాలి.
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, AP Politics, Balakrishna, Boyapati Srinu, K. S. Ravikumar, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు