ముస్లిమ్ సోదరులకు నట సింహా బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. బాలయ్యతో పాటు చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.

news18-telugu
Updated: May 25, 2020, 12:52 PM IST
ముస్లిమ్ సోదరులకు నట సింహా బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు..
బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు (Twitter/Photo)
  • Share this:
ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ ఆదివారంతో రంజాన్ నెల ఉపవాస దీక్షలు ముగయడంతో పవ్వాల్ నెల మొదటి రోజున  ఈద్ జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఐతే... సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల్లో నిన్నే పండుగ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా చాలా దేశాల్లో ఈ వేడుకలు ఇవాళ జరుగుతున్నాయి. ఇప్పటికే ముస్లిమ్ సోదరులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. తాజాగా నందమూరి నట సింహం.. రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండగ అనేది ప్రేమ, త్యాగాలకు ప్రతీక. లాక్‌డౌన్ వంటి కఠిన సమయంలో కూడా ఎంతో మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. వారి ప్రార్ధనలు ఫలించి కరోనా మహామ్మారి త్వరలో అంతం కావాలని కోరుకుంటునాన్నారు. అంతేకాదు అందరు కూడా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని వేడుకుంటున్నట్టు తెలిపారు.


అటు బాలకృష్ణతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ముస్లిమ్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.








First published: May 25, 2020, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading