Unstoppable with NBK: అన్ స్టాపబుల్ ఓటీటీ షో ద్వారా నందమూరి బాలకృష్ణ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇఫ్పటికే ఈ షో హక్కులను కొనుగోలు చేసేందుకు పలు టీవీ చానెల్స్ సైతం ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య ఈ షో (Unstoppable with NBK) కోసం చేస్తున్న హోం వర్క్ అంతా ఇంతా కాదు. చాలా డెడికేషన్ తో కొత్త తరంతో కలిసి పనిచేస్తూ హిట్ కొట్టారు అనేది ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్న వాదన. ఇంత కాలం బాలయ్యలో ఒక యాంగిల్ మాత్రమే చూశారని, ఈ షో చూస్తే థింకింగ్ మారిపోద్ది అని ప్రోమోలోనే బాలయ్య హింట్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే షోను డిజైన్ చేశారు. ఇప్పటకే 6 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ తాజాగా రవితేజ, గోపిచంద్ మలినేని ఇంటర్వ్యూతో మరో మజిలీ పూర్తి చేసుకుంది. అంతేకాదు అన్ స్టాపబుల్ కోసం బాలయ్య పూర్తి జోవియల్ గా మారిపోతున్నారు. తన ప్రశ్నలతో అతిథులను ఆటపట్టించడమే కాదు. వాళ్లను ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్తున్నారు. అంతేకాదు ప్రతీ షోలోనూ ఒక హ్యూమన్ యాంగిల్ స్టోరీని ప్రసారం చేస్తున్నారు. ఇక తనపై వచ్చిన అపోహలు, గాసిప్స్ కు బాలయ్య ఈ వేదిక పై నుంచే క్లారిటీ ఇఛ్చేస్తున్నారు. తనకు రవితేజ మధ్య గొడవ అయ్యిందని దశాబ్దం క్రితం వెబ్ సైట్స్ కోడైకూశాయి. అలాంటి గాసిప్స్ కు బాలయ్య, ఏకంగా రవితేజతోనే క్లారిటీ ఇప్పించేసి అలాంటిదేమీ లేదని తేల్చేశారు.
Katrina Kaif and Vicky Kaushal: ఒక్క సినిమాలోనూ కలిసి నటించని జంట.. ఎలా ఒక్కటయ్యారో తెలుసా?
ఇక తాను చేసిన సినిమాల్లో ఫ్లాపులపైనే ఆయనే సెటైర్లు వేసుకోవడం, కూడా గమనించవచ్చు. ముఖ్యంగా రవితేజతో చేసిన ఇంటర్వ్యూ సందర్భంగా తాను నటించిన నిప్పురవ్వ సినిమాపై బాలయ్య స్వయంగా సెటైర్ వేసుకోవడమే కాదు. ఆ సినిమాలో రవితేజ నటించకపోవడం అదృష్టం అంటూ చెప్పాడు. అలాగే సినిమా షూటింగ్ సమయంలోనే తనకు నిప్పురవ్వ చిత్రం రాడ్డు రంబోలా అవుతుందన్న సంగతి అర్థం అయ్యిందని చెప్పుకొచ్చాడు.
Nikki Tamboli: కిక్కెక్కించే చూపులతో నిక్కి తంబోలి.. లేటెస్ట్ హాట్ ఫోటో షూట్!
ఇదిలా ఉంటే ఈ ఇంటర్వ్యూ చివరలో మాత్రం బాలయ్య తెలుగు ఇండస్ట్రీలో జరిగే పరిణామాలపై కొందరు ఫేక్ న్యూస్ లతోనూ, వ్యక్తుల ప్రతష్టున మంటగలిపేలా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారు తనకు ఎదురు పడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. రవితేజకు, బాలకృష్ణకు పడదు, చిరంజీవి – బాలకృష్ణ ఫోన్ లో మాట్లాడుకోరు, నా హీరో తోపు – నీ హీరో సోపు, ఏంటి ఇవన్నీ!? లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయ్యింది, దొరికితే దవడ పగిలిపోద్ది కాస్త గట్టిగా ఫైర్ అయ్యారు. అయితే అదే పనిగా మనం చేయాల్సింది ఒక్కటే… ఊరు, పేరు చెప్పుకోలేని, ధైర్యం లేని ఈ వెధవలను క్షమిద్దాం, మన మీద వచ్చిన విమర్శలను ప్రేమిద్దాం అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూసులు రాసేవాళ్లను వదిలేద్దాం అని బాలయ్య ప్రస్తావించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Unstoppable NBK