Home /News /movies /

NANDAMURI BALAKRISHNA NBK 107 SHOOTING FAN MOMENT VIDEO VIRAL SLB

Viral Video: బాలయ్య బాబుకు ఈలలతో స్వాగతం చెప్పిన ముసలమ్మ.. మరవలేని ఫ్యాన్ మూమెంట్!

Photo Credit: Twitter

Photo Credit: Twitter

NBK 107: సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ రచ్చ చేస్తుంటాయి. నందమూరి నటసింహం బాలయ్య బాబుకు సంబంధించి అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నందమూరి అభిమానులు ఫిదా అవుతూ తెగ షేర్ చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ రచ్చ చేస్తుంటాయి. నందమూరి నటసింహం బాలయ్య బాబుకు (Nandamuri Balakrishna) సంబంధించి అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నందమూరి అభిమానులు ఫిదా అవుతూ తెగ షేర్ చేసుకుంటున్నారు. బాలకృష్ణ అభిమాన వర్గానికి ఏజ్ లిమిట్ అనేదే లేదు అని ఈ వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం NBK 107 షూటింగ్ లో పాల్గొంటున్న బాలకృష్ణ.. ఇందులో భాగంగా సోమవారం నాడు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడి జనసందోహానికి సంబంధించిన కొన్ని వీడియోస్ బాలయ్య క్రేజ్ ఏంటనేది రుజువు చేస్తున్నాయి.

బాలయ్య బాబు వస్తున్నాడని తెలిసి చిన్న పెద్దా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున అక్కడికి జనం చేరుకున్నారు. అందులో ఓ ముసలావిడ ఈలలు వేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకుంది. దీంతో ఈ వీడియోను బాలయ్య అభిమానులకు నో ఏజ్ లిమిట్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇంకేముంది ఈ వీడియో క్లిప్ నెట్టింట వెంటనే వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల అఖండ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మాస్ డైరెక్టర్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.



ఇటీవలే టర్కీలో ఓ షెడ్యూల్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవాలని భావిస్తున్నారట. చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Gopichand malineni, Nandamuri balakrishna, NBK 107

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు