హోమ్ /వార్తలు /సినిమా /

NBK Nartanasala Srihari as Bheema Look: నర్తనశాలలో భీముడుగా శ్రీహరి లుక్ విడుదల.. వలలుడిగా రియల్ స్టార్..

NBK Nartanasala Srihari as Bheema Look: నర్తనశాలలో భీముడుగా శ్రీహరి లుక్ విడుదల.. వలలుడిగా రియల్ స్టార్..

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

Nartanasala Srihari as Bheema First Look:  నందమూరి నట సింహం బాలకృష్ణ .. తన తండ్రి నటించిన పలు చిత్రాలను తాను రీమేక్ చేసాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అర్జునుడిగా బాలయ్య లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం.. తాజాగా భీముడిగా శ్రీహరి లుక్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

  Nartanasala Srihari as Bheema First Look:  నందమూరి నట సింహం బాలకృష్ణ .. తన తండ్రి నటించిన పలు చిత్రాలను తాను రీమేక్ చేసాడు. అందులో లవకుశ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ గా రీమేక్ చేస్తే.. ‘పాండురంగ మహాత్యం’ సినిమాను పాండురంగడు’ సినిమాగా రీమేక్  చేసారు. అటు రాముడు భీముడు సినిమాను అదే టైటిల్‌తో కాస్తా మార్పులు చేసి అదే రాముడు భీముడు టైటిల్‌తో రీమేక్  చేసి సక్సెస్ అందుకున్నారు. మరోవైపు తన తండ్రి ఎన్టీఆర్, మహానటి సావిత్రి నటించిన ‘నర్తనశాల’ సినిమాను అదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి బాటలో తొలిసారి మెగాఫోన్ పట్టుకొని ‘నర్తనశాల’ చిత్రాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించాడు. ఇక ‘నర్తనశాల’ సినిమాను అప్పట్లో అన్నగారు ‘శ్రీ మద్విరాట పర్వం’ గా తన దర్శకత్వంలోనే రీమేక్  చేసారు. అందులో అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు‌తో పాటు విరాటపర్వంలో బృహన్నలగా ఐదు పాత్రల్లో నటించి మెప్పించారు అన్న ఎన్టీఆర్. ఈ చిత్రంలో బాలయ్య.. అభిమన్యుడి పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంలో వాణిశ్రీ ద్రౌపది పాత్రలో నటించింది.ఆ తర్వాత బాలయ్య.. తన స్వీయ దర్శకత్వంలో ఎంతో అట్టహాసంగా ‘నర్తనశాల’ సినిమాను ప్రారంభించారు.

  అర్జునుడిగా బాలకృష్ణ (Twitter/Photo)

  అప్పట్లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్‌లో 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఈ సినిమాలో ద్రౌపది పాత్రధారి సౌందర్య అకాల మరణంలో బాలయ్య ఈ సినిమాను ఆపేసారు. ద్రౌపది పాత్రలో సౌందర్య కాకుండా.. మరో నటిని ఊహించుకోవడానికి ఇష్టపడని బాలకృష్ణ మొత్తానికి ‘నర్తనశాల’ చిత్రానికి ప్యాకప్ చెప్పేసారు.  'నర్తనశాల' చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఈ నెల 24న ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే అర్జునుడి బాలయ్య పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ చిత్రంలో భీముడి పాత్రధారి శ్రీహరి లుక్‌ను విడుదల చేసారు.

  Nandamuri Balakrishna Nartanasala Movie Srihari as Bheema Look Released,srihari,Srihari as bheema,srihari as bheema in nartanasala,balakrishna nartanasala movie,Balakrishna Nandamuri Nartanasala Movie first Look released,Balayya Nartanasala first look released,balakrishna nartanasala movie shooting,balakrishna nartanasala movie shreyas ott,balakrishna nartanasala movie NBK theatre,balakrishna nartanasala movie shooting video,balakrishna nartanasala movie soundarya,balakrishna nartanasala movie ott release,దసరాకు నర్తనశాల,బాలకృష్ణ నర్తనశాల విడుదల,17 నిమిషాల నర్తనశాల సినిమా,బాలకృష్ణ నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల,బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల,నందమూరి బాలకృష్ణ నర్తనశాల ఫస్ట్ లుక్ విడుదల,నర్తనశాలలో భీముడిగా శ్రీహరి లుక్,శ్రీహరి లుక్‌కు మంచి రెస్పాన్స్,నర్తనశాలలో భీముడిగా శ్రీహరి లుక్
  నర్తనశాలలో భీముడిగా శ్రీహరి లుక్ (Twitter/Photo)

  ఈ లుక్ విడుదల సందర్భంగా శ్రీహరి తనయుడు మేఘాంశ్ సోషల్ మీడియాగా స్పందించాడు. ఈ సందర్భంగా చాలా యేళ్ల తర్వాత తన తండ్రి నటించిన సినిమాను చూడబోతున్నందకు బాలయ్యతో పాటు శ్రేయాస్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  గతంలో శ్రీహరి.. బాలయ్య హీరోగా నటించిన ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలో దుర్యోధనుడి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత ఈ సినిమాలో భీముడి పాత్రలో అలరించారు.ఈ సినిమాను చూడాలనుకునే వారికి టికెట్ ధర రూ. 50 నిర్ణయించారు. కొంత మంది బాలయ్య అభిమానులు మాత్రం రూ. 10 లక్షల పెట్టి నర్తనశాల సినిమా టికెట్‌ను కొనబోతున్నారు. అలా టికెట్ కొన్ని అభిమానుల వివరాలను బాలయ్య ప్రకటించనున్నాడు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్టు తెలిపారు బాలయ్య.

  ఎన్నాళ్ళనుండో 'నర్తనశాల' సన్నివేశాలను చూడాలన్న బాలయ్య అభిమానుల కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది.  ఏదిఏమైనా ఈ సన్నివేశాలు చూస్తే  డైరెక్టర్‌గా బాలయ్య విజన్ ఎలాంటిదో ప్రేక్షకులకు తెలుస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, NBK Nartanasala, Tollywood