హోమ్ /వార్తలు /సినిమా /

NBK Nartanasala Collections: నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

NBK Nartanasala Collections: నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

NBK Nartanasala Collections: అదేంటి.. నర్తనశాల విడుదలైంది థియేటర్‌లో కాదు కదా.. ఓటిటిలో కదా.. మరి కలెక్షన్స్ ఎలా లెక్కిస్తారు అనుకుంటున్నారా..? చేయొచ్చు.. లెక్కించొచ్చు.. చూసిన ప్రేక్షకులు.. తెగిన టికెట్స్ అన్నీ లెక్కలు కడితే..

అదేంటి.. నర్తనశాల విడుదలైంది థియేటర్‌లో కాదు కదా.. ఓటిటిలో కదా.. మరి కలెక్షన్స్ ఎలా లెక్కిస్తారు అనుకుంటున్నారా..? చేయొచ్చు.. లెక్కించొచ్చు.. చూసిన ప్రేక్షకులు.. తెగిన టికెట్స్ అన్నీ లెక్కలు కడితే ఎంత వసూలు చేసిందనేది ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇప్పుడు బాలకృష్ణ నటించిన నర్తనశాల సినిమాకు సంబంధించిన తొలిరోజు వసూళ్లు అలాగే బయటికి వచ్చాయి. ఈయన స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టి మధ్యలో ఆపేసిన నర్తనశాలను 17 ఏళ్ళ తర్వాత దసరాకు విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఓటిటి వేదికగా శ్రేయాస్ ఈటీలో ఈ సినిమాను విడుదల చేసారు. కేవలం 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను మాత్రమే విడుదల చేశారు. 2004 మార్చ్ 1న ప్రారంభమైన ఈ చిత్రం సౌందర్య అనుకోని మరణంతో ఆగిపోయింది. ఆ తర్వాత భీముడి పాత్రదారి శ్రీహరి కూడా కన్నుమూసాడు. అయితే ఇప్పుడు అనుకోకుండా నర్తనశాల పే ఫర్ వ్యూ పద్దతిలో విడుదల చేసాడు బాలయ్య.

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)
NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

17 నిమిషాల వీడియో అయినా కూడా బాలయ్య అభిమానులు దీనికోసం బాగానే వేచి చూసారు. ఈ సినిమాను పే పర్ వ్యూ పద్దతిలో చూడటానికి నందమూరి ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. ఈ లెక్కలోనే నర్తనశాల దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిందని తెలుస్తుంది. సినిమా విడుదలయ్యే వరకు.. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కలిపి ఒక లక్షా 58 వేల దాకా టికెట్ అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో 37 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. అంటే మొత్తం తొలిరోజు నర్తనశాల సినిమాకు 1 లక్షా 95 వేల దాకా వ్యూస్ దక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ఒక్క టికెట్ 50 రూపాయలు నిర్ణయించారు.

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)
NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

ఈ లెక్కన 1 లక్షా 95 వేల టికెట్లకు 50 రూపాయల చొప్పున లెక్కిస్తే మొత్తం మీద సినిమాకి తొలిరోజు 97 లక్షల 50 వేల దాకా కలెక్షన్స్ వచ్చాయన్నమాట. థియేటర్లు లేకుండా యాప్‌లో మాత్రమే ఈ రకంగా వసూళ్లు వచ్చాయి. కేవలం 17 నిమిషాల వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రావడం.. డబ్బులు వసూలు చేయడం నిజంగానే సంచలనం. కేవలం ఈ కోటి రూపాయలు మాత్రమే కాదు.. నర్తనశాల ఎన్ని వసూలు చేసినా కూడా అన్నీ బసవతారకం మెమోరియల్ ట్రస్ట్‌కి ఈ మొత్తాన్ని అందించనున్నాడు బాలయ్య.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: NBK Nartanasala, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు