నందమూరి బాలకృష్ణ మరోసారి తెలిసి ఆ తప్పు చేస్తాడా అని అందరు చర్చించుకుంటున్నారు. బాలయ్య.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో తన ఓన్ బ్యానర్ ఎన్బీకే ఫిల్మ్స్‌లో తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. రెండు పార్టుల తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రకు న్యాయం చేకూర్చారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు పార్డులుగా కాకుండా.. ఒకే పార్టుగా తెరకెక్కించనట్టైయితే.. ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు చాలా మంది అభిప్రాయ పడ్డారు. తన తండ్రి జీవితంపై ఎంతో మక్కువగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమాకు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా విష్ణు ఇందూరి.. జయలలిత జీవితంపై ‘తలైవి’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం చెన్నైలో ప్రారంభమైంది. కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో అరవింద్ స్వామి.. ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఎన్టీఆర్ పాత్ర కోసం నిర్మాత విష్ణు ఇందూరి..బాలకృష్ణను సంప్రదించినట్టు సమాచారం.
అల్లూరి పాత్రలో ఎన్టీఆర్ బాలయ్య
వెండితెరపై జయలలిత, ఎన్టీఆర్ ది క్రేజీ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్లో చాలా సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. అందుకే ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేసినట్టైయితే...ఈ సినిమాకు క్రేజ్ వస్తుందని నిర్మాత భావిస్తున్నాడు. ఇక ఒకసారి చేదు జ్ఞాపకంగా మిగిల్చిన తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ మరోసారి చేసే సాహసం చేస్తాడా ? లేకపోతే.. ముచ్చటగా జయలలిత బయోపిక్‌లో మూడోసారి తండ్రి పాత్రను వేసి తనపై వచ్చిన అపవాదును బాలకృష్ణ తుడిచిపెడతాడా లేదా అనేది చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.