NANDAMURI BALAKRISHNA JR NTR SILENCE OVER MEGASTAR CHIRANJEEVI SYE RAA NARASIMHA REDDY MOVIE PK
‘సైరా’పై నందమూరి కుటుంబం సైలెన్స్.. నోరు మెదపని బాలయ్య, ఎన్టీఆర్..
సైరాపై నందమూరి కుటుంబం సైలెన్స్
సైరా సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా చిరంజీవికి ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఇదే విషయాన్ని చిరు కూడా మీడియా ముందు చెప్పాడు. సినిమా చూసిన తర్వాత నాగార్జున కన్నీరు పెట్టుకున్నాడని..
సైరా సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా చిరంజీవికి ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఇదే విషయాన్ని చిరు కూడా మీడియా ముందు చెప్పాడు. సినిమా చూసిన తర్వాత నాగార్జున కన్నీరు పెట్టుకున్నాడని.. వెంకటేష్ కౌగిలింతలతో చంపేసాడని చెప్పాడు. ఇక వాళ్లతో పాటు మిగిలిన హీరోలు, దర్శకులు, కమెడియన్లు.. ఇలా ఒక్కరేంటి అంతా మెగాస్టార్ ఇంటికి క్యూ కట్టారు. ఓ తెలుగు సినిమాకు ఈ స్థాయి గౌరవం రావడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు చిరంజీవి. ఈ వయసులో చిరు చేసిన ఈ పాత్రను చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
తెలుగులో వసూళ్ల వర్షం కూడా కురుస్తుంది. హిందీలో 'వార్' సినిమా ఉంది కాబట్టి అక్కడ ఫ్లాప్ అయింది కానీ మన దగ్గర మాత్రం సత్తా చూపిస్తున్నాడు నరసింహా రెడ్డి. ఇక ఈ చిత్రాన్ని తమ సినిమాగా భావించి తెలుగు ఇండస్ట్రీ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి నందమూరి కుటుంబం మాత్రం ఒక్కరు కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పైగా ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.. ఇలాంటి సమయంలో కూడా ఎన్టీఆర్ సైరాపై కమెంట్ చేయకపోవడం నిజంగానే గమనార్హం.
సైరాపై నందమూరి కుటుంబం సైలెన్స్
ఇక బాలయ్య కూడా తనకు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక మిత్రుడు చిరంజీవి అని చెప్పాడు. కానీ ఆయన సినిమా ఇప్పటి వరకు చూడకపోవడం నిజంగానే విడ్డూరం. అసలు నందమూరి హీరోలు చిరంజీవి సినిమాను చూసారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చూసినా కూడా స్పందించడం లేదా.. లేదంటే చూడలేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇండస్ట్రీ అంతా మెచ్చుకుంటున్న సినిమాపై నందమూరి ఫ్యామిలీ సైలెన్స్ మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.