హోమ్ /వార్తలు /సినిమా /

లారీ డ్రైవర్ కూతురికి బాలకృష్ణ సాయం.. ఉచితంగా...

లారీ డ్రైవర్ కూతురికి బాలకృష్ణ సాయం.. ఉచితంగా...

హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ బాధితురాలితో బాధపడుతున్న ఓ బాలికకు ఉచితంగా చికిత్స చేయించారు.

    హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ బాధితురాలితో బాధపడుతున్న ఓ బాలికకు ఉచితంగా చికిత్స చేయించారు. అంతేకాదు, ఆయన వ్యక్తిగతంగా వెళ్లి బాలికను కలిసి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆ బాలిక నుదుటి మీద ముద్దుపెట్టి బాలికను దీవించారు. అనంతపురం లోని సోమనాథ్ నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని స్వప్న కు వైద్యులు బోన్ క్యాన్సర్ సోకింది. వ్యాధి నయం చేయడానికి సుమారు 6 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. తండ్రి లారీ డ్రైవర్ గా సంపాదించేది కుటుంబ కనీస అవసరాలకే సరిపోని పరిస్థితులలో 6 లక్షల రూపాయలు ఎక్కడ నుండి తేవాలో తెలియక కూతురును తల్లితండ్రులు ఇంటిలోని ఉంచి సహాయం కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలకై వెదులాట ప్రారంభించార. అదే సమయంలో స్వప్నకు అండగా తోటి విద్యార్థులు సమస్యను నందమూరి బాలకృష్ణ దృష్టికి బసవతారకం హాస్పిటల్ యాజమాన్యం ద్వారా తీసుకొని వచ్చి సహాయాన్ని అర్థించారు. వెంటనే బాలయ్య బాలికను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించి.. ఆమెకు ఉచితంగా చికిత్స అందేలా చూశారు. చికిత్స తర్వాత ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్వయంగా బాలిక వద్దకు వెళ్లారు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడే కాదు. గతంలో కూడా నందమూరి బాలకృష్ణ పలుమార్లు తన అభిమానులకు సాయం చేశారు. గతంలో డ్రామా జూనియర్స్ కార్యక్రమం ద్వారా జూనియర్ బాలయ్యగా పేరుతెచ్చుకున్న గోకుల్ చనిపోయినప్పుడు చాలా ఆవేదన వ్యక్తం చేశారు.

    కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్ సీసీటీవీ దృశ్యాలు

    First published:

    Tags: Bala Krishna Nandamuri, Hindupuram

    ఉత్తమ కథలు