తెలంగాణ మంత్రి KTRకు చెక్ అందించిన బాలకృష్ణ..

Balakrishna KTR: కరోనా బాధితుల కోసం కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందించాడు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు తెలంగాణకు కూడా 50 లక్షలు ఇచ్చాడు బాలయ్య.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2020, 3:11 PM IST
తెలంగాణ మంత్రి KTRకు చెక్ అందించిన బాలకృష్ణ..
కేటీఆర్‌కు చెక్ అందించిన బాలయ్య (balakrishna ktr)
  • Share this:
కరోనా బాధితుల కోసం కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందించాడు బాలకృష్ణ. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది విరాళం ప్రకటించారు. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడూ ముందు స్పందించే బాలయ్య ఈ సారి మాత్రం కాస్త ఆలస్యం చేసాడేమో అనిపించింది. అయినా కూడా భారీ విరాళంతో ముందుకొచ్చాడు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు బాలయ్య. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన చెక్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అందచేసాడు ఈయన.
కేటీఆర్‌కు చెక్ అందించిన బాలయ్య (balakrishna ktr)
కేటీఆర్‌కు చెక్ అందించిన బాలయ్య (balakrishna ktr)


మంత్రి కేటీఆర్‌తో కాసేపు ముచ్చటించిన బాలయ్య.. ఆ తర్వాత చెక్ అందించాడు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. అంతేకాదు.. తన సిబ్బందికి కూడా బాధితుల కోసం కావాల్సినవి చూసుకోవాలంటూ ఆదేశించాడు బాలకృష్ణ. ఇదంతా పక్కనే ఉండి గమనించిన కేటీఆర్.. బాలయ్యకు నమస్కారం పెట్టాడు. ఎప్పుడు ఏ కష్టమొచ్చినా ముందుండే బాలయ్య.. మరోసారి భారీ విరాళం అందించి మా మంచి బాలయ్య అనిపించుకున్నాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading