Home /News /movies /

NANDAMURI BALAKRISHNA GOPICHAND MALINENI NBK 107 MOVIE TITLE TEASER RELEASED ON BALAYYA BIRTHDAY TA

NBK 107 - Balakrishna : మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. అదిరిన బాలయ్య బర్త్ డే వేట..

అదిరిన బాలయ్య బర్త్ డే వేట (Twitter/Photo)

అదిరిన బాలయ్య బర్త్ డే వేట (Twitter/Photo)

NBK 107- Balakrishna | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ చిత్రం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

    NBK -107 - Balakrishna - Gopichanda Malineni : గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్  తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. రీసెంట్‌గా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.  ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలయ్యకు సంబంధించిన రెండు లుక్స్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా ఈ శుక్రవారం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ  సినిమాకు సంబంధించిన ఫస్ట్ హంట్ అంటూ ఓ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన 1 నిమిషం 2 సెకన్లు టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు  ఓ రేంజ్‌లో మాస్ రాంపేజ్‌గా ఉంది.



    ఈ టీజర్‌లో బాలయ్య ఇష్టదైవం లక్ష్మీ నరసింహా స్వామి చూపిస్తూ స్టార్ట్ చేశారు. నోటిలో సిగార్‌తో నల్ల షర్టుతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఓ ఊరి పెద్ద పాత్రలో నటించారు. మరోసారి మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఈ టీజర్‌ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా వరుసగా జీపులు ఒకదాని వెంట ఒకటి వెళ్లే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.ముఖ్యంగా భయం నా బయోడేటాలోనే లేదు బోసుడీకే.. నరకడం మొదలు పెడితే.. ఏ పార్ట్ ఏదో మీకు పెళ్లాలకు కూడా తెలియదు నా కొడక్కల్లారా  వంటి డైలాగులు బాలయ్య అభిమానులకు కిక ఎక్కించేలా ఉన్నాయి. మొత్తంగా ధర్మ సంస్థపానార్ధం ఆయుధం పట్టిన వ్యక్తి పాత్రలో బాలయ్య క్యారెక్టర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేశాడు.



    ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

    Balakrishna Remakes: మంగమ్మ మనవడు టూ లక్ష్మీ నరసింహా వరకు బాలయ్య రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్‌గా ఉంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటిస్తారనుకుంటే టీజర్‌తోనే సరిపెట్టారు. ఈ చిత్రానికీ  ‘పెద్దాయన,’ తో పాటు అన్నగారు, వేట పాలెం, రెడ్డి గారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరి బాలయ్య సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Balayya, NBK 107, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు