Balakrishna: బాలకృష్ణ తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అవి చేసినా.. బాలయ్య మాత్రం ఆ పని చేయలేదు. వివరాల్లోకి వెళితే.. నందమూరి నట సింహా బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ టాప్ హీరోల్లో ఒకరు. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయికుడు. బాలనటుడిగా 1974లో తెరంగ్రేట్రం చేసి ఇప్పటిదాకా అవిశ్రాంతంగా 47 ఏళ్ళుగా నటిస్తున్న ఏకైక నట వారసుడు. బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఒక నట వారసుడు అది కూడా హీరోగా నటించింది లేదు. హీరోగా 105 సినిమాలు చేసారు. ఇక తన తరంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు కూడా బాలయ్యే. ఇక అందరి హీరోలది ఒక రకమైతే.. బాలయ్యది డిఫరెంట్ స్లైల్ అనే చెప్పాలి.
తన తోటి హీరోల్లో చాలా మంది సినిమాల్లో వచ్చిన ఇమేజ్‌తో వాణిజ్య ప్రకటనల్లో నటించారు. కానీ బాలయ్య మాత్రం ఇంత వరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్‌లో నటించలేదు. దానికీ కారణం కూడా ఉందని చెప్పుకొచ్చారు. యాడ్స్‌లో నటించకపోవడానికి నాన్న ఎన్టీఆర్ కారణం అని పలు సందర్భాల్లో బాలయ్య ప్రస్తావించారు.
అప్పట్లో నాన్న ఎన్టీఆర్ ఏనాడు తన ఇమేజ్‌ను అడ్డం పెట్టుకొని సినిమా ప్రకటనల్లో నటించలేదు. అయితే కొంత మంది ఎన్టీఆర్ గారిని తమ సొంత ఆస్తిగా భావించి ఆయన సినిమాల్లో నటించిన ఫోటోల్నే తమ ప్రొడక్ట్ మీద వేసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్లను చెప్పకొచ్చారు బాలయ్య. మనకు ఈ ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే. అందుకే వాళ్లను మెప్పించే సినిమాలు చేసి వాళ్ల అభిమానాన్ని పొందాలి. అంతే కానీ.. వాళ్లిచ్చిన ఇమేజ్‌ను మన స్వార్థం కోసం ఉపయోగించకూడదన్నదే నాన్న ఎన్టీఆర్ గారి అభిప్రాయం. ఆయన బాటలోనే నేను కూడా ఇప్పటి వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించలేదన్నారు.
అలా చేయడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగితే మాత్రం తప్పకుండా చేస్తానన్నారు. అదే పనిగా డబ్బు కోసం మాత్రం చేయను. నాకు ఉన్నది సరిపోతుందని చెప్పుకొచ్చారు.మరోవైపు బాలయ్య తరం హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున పలు కమర్షయల్ యాడ్స్‌లో నటించారు. ఇక నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chiranjeevi, Nagarjuna Akkineni, NBK, Tollywood, Venkatesh