• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NANDAMURI BALAKRISHNA FANS GET SHOCKED MOKSHAGNA PHOTOS ON BALAYYA BIRTHDAY EVENT TA

మోక్షజ్ఞ‌ను చూసి షాక్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్ ..

మోక్షజ్ఞ‌ను చూసి షాక్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్ ..

వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌, జీనయస్ బుక్ ఆఫ్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాయి. (Twitter/Photo)

నందమూరి బాలకృష్ణ ఏకైక కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. నిన్న బాలయ్య బర్త్ డే వేడుకల్లో మోక్షజ్ఞ పర్సనాలిటీ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

  • Share this:
    నందమూరి బాలకృష్ణ ఏకైక కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అన్ని కుదరితే.. ఈ పాటికే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేవాడే. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత ఇంత వరకు ఏ హీరో కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వలేదు. నందమూరి  ఫ్యామిలీ నుంచి హీరో వచ్చిన పదిహేనేళ్లు కావొస్తోంది. అదే చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ నుంచి డజను పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ మెగా వారసుల ఎంట్రీ కొనగుతూనే ఉంది. తాజాగా బాలయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా పలు చానెల్స్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ సందర్భంగా త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆయన కోసం దర్శకులు కథలను కూడా రెడీ చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తాజాగా బాలకృష్ణ 60 పుట్టినరోజు వేడుకల్లో ఆయన తనయుడు మోక్షజ్ఞ  భారీ కాయాన్ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

    nandamuri balakrishna fans get shocked mokshagna photos on balayya birthday event,mokshagna entry,balakrishna,balakrishna birthday,balakrishna mokshagna nandamuri, nandamuri fans get shocked mokshagna look,mokshagna puri jagannath,puri jagannath balakrishna,puri jagannath chirutha,puri mokshagna,mokshagna nandamuri,balakrishna mokshagna,పూరీ చేతిలో నందమూరి మోక్షజ్ఞ,మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్,మోక్షజ్ఞ బాలకృష్ణ,మోక్షజ్ఞ పూరీ,పూరీ జగన్నాథ్ చిరుత,పూరీ జగన్నాథ్ పైసావసూల్ బాలయ్య,,మోక్షజ్ఞ లుక్ చూసి భయపెడుతున్న బాలయ్య అభిమానులు,మోక్షజ్ఞ నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో మోక్షజ్ఞ
    బాలకృష్ణతో మోక్షజ్ఞ(ఫైల్ ఫోటో)


    బాలయ్య బర్త్ డే వేడుకల్లో  మోక్షజ్ఞ పర్సనాలిటీ చూసి ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఇక మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలంటే ముందుగా  స్లిమ్‌గా మారాల్సిందే. దానికి ఎంత లేదన్నా ఇంకో యేడాది పట్టొచ్చు. ఆ తరవాత సినిమా షూటింగ్ మొదలు పెట్టి విడుదలయ్యే వరకు ఎంత లేదన్నా.. 2022 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 25 ఏళ్లు. ఇప్పటికే చాలా మంది నట వారసులు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఒక బాలకృష్ణ విషయానికొస్తే.. ఆయన హీరోగా 14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి.. 25 ఏళ్లకే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతిని నందమూరి అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: