హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్.. మోక్షజ్ఞను అలా చూసి అభిమానుల్లో డౌట్స్ షురూ!

బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్.. మోక్షజ్ఞను అలా చూసి అభిమానుల్లో డౌట్స్ షురూ!

Photo Twitter

Photo Twitter

Balakrishna Family Photo: నందమూరి వంశం నుంచి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం యావత్ అభిమాన లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. మోక్షజ్ఞ ఎక్కడ కనిపించినా, ఎలా కనిపించినా ఆయన సినీ ఎంట్రీ గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ తాజాగా బయటకొచ్చిన బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై జనాల్లో అనుమానాలు రేకెత్తించింది.

ఇంకా చదవండి ...

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నారు. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నారు ఈ నందమూరి నటసింహం. ఇటీవలే అఖండ రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకొని కరోనా పరిస్థితుల తర్వాత ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బాలయ్య బాబు ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ మసాలా మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నందమూరి వంశం నుంచి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం యావత్ అభిమాన లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. మోక్షజ్ఞ ఎక్కడ కనిపించినా, ఎలా కనిపించినా ఆయన సినీ ఎంట్రీ గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ తాజాగా బయటకొచ్చిన బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై జనాల్లో అనుమానాలు రేకెత్తించింది.

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అంటే అభిమానులకు అదో కిక్కు. తమ అభిమాన హీరో కొడుకు, కూతురు సినీ ఆరంగేట్రం చేస్తుండటం అనేది ఫ్యాన్స్‌కి ఓ స్పెషల్ గిఫ్ట్ లాంటిది. ఇప్పటిదాకా ఎందరో సినీ వారసులు కెమెరా ముందుకొచ్చి తమ తమ టాలెంట్‌తో ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనేది మాత్రం నందమూరి అభిమానులకు అందని ద్రాక్ష అవుతోంది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ మోక్షజ్ఞ సినిమా మాత్రం అధికారికంగా కన్ఫ్రమ్ చేయడం లేదు. ఇంతలో తాజాగా బయటకొచ్చిన ఫోటోలో మోక్షజ్ఞ లుక్ అందరినీ ఆశ్చర్య పర్చింది.

నందమూరి ఫ్యాన్స్ అంతా మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో ఆయన సినీ ఎంట్రీకి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ అవేవీ నిజం కాలేదు. ఇంతలో తన దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య బాబు చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్‌గా ఓ కథ రెడీ అవుతోందని, ఆ సినిమాతో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని అన్నారు.

దీంతో హీరోకి కావాల్సిన ఫిజిక్, లుక్ కోసం మోక్షజ్ఞ కసరత్తులు చేస్తున్నారని అంతా భావించారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న బాలకృష్ణ ఫ్యామిలీ ఫొటోలో మాత్రం మోక్షజ్ఞ లుక్ కొత్త అనుమానాలకు తెర లేపింది. ఈ ఫొటోలో బాలయ్య బాబుతో పాటు ఆయన సతీమణి వసుంధర దేవి, పెద్ద కుమార్తె నారా బ్రహ్మణి, కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ ఉన్నారు. మోక్షజ్ఞ ఫిట్నెస్, లుక్‌లో అయితే పెద్దగా మార్పులు కనిపించలేదు. దీంతో సినీ ఎంట్రీ విషయంలో మోక్షజ్ఞ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదా? అసలు హీరోగా కెరీర్ మలచుకోవడం ఆయనకు ఇష్టం లేదా అనే కోణంలో అనుమానాలు షురూ అయ్యాయి. సో.. చూడాలి మరి బాలయ్య చెప్పినట్లుగా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారా? మరేదైనా కెరీర్ ఎంచుకుంటారా అనేది.

First published:

Tags: Nandamuri balakrishna, Nandamuri Mokshagna, నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ

ఉత్తమ కథలు