బాలకృష్ణ రెమ్యూనరేషన్ డబుల్...ఎంతో తెలుసా...

సినిమా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా బాలయ్య రెమ్యూనరేషన్ స్టడీగా ఉంటుందని సినీజనం చర్చించుకుంటుంటారు.

news18-telugu
Updated: October 29, 2019, 11:27 AM IST
బాలకృష్ణ రెమ్యూనరేషన్ డబుల్...ఎంతో తెలుసా...
బాలకృష్ (ఫైల్ ఫోటో)
  • Share this:
సక్సెస్ అండ్ ఫెయిలూర్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించే టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ... త్వరలోనే రూలర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు బాలకృష్ణ రూ. 7 కోట్లు వరకు తీసుకుంటారని టాక్.

సినిమా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా బాలయ్య రెమ్యూనరేషన్ స్టడీగా ఉంటుందని సినీజనం చర్చించుకుంటుంటారు. అసలు రెమ్యూనరేషన్ విషయాన్ని ఈ అగ్ర హీరో అంతగా పరిగణనలోకి తీసుకోరనే ప్రచారం కూడా ఉంది. అయితే అలాంటి బాలకృష్ణ తన కొత్త సినిమా విషయంలో సంచలనం నిర్ణయం తీసుకున్నారని... రూలర్ సినిమాకు ఏకంగా రూ. 14 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. బాలకృష్ణ డిమాండ్‌తో షాకైన నిర్మాత సి. కళ్యాణ్... స్టార్ హీరో అడిగినంత ఇచ్చేందుకు ఇతర టెక్నిషియన్ల రెమ్యూనరేషన్‌లో కోత పెడుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com