• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NANDAMURI BALAKRISHNA DOES THAT FLOP MOVIE JUST BECAUSE OF HIS FATHER NTR WISH WITH KODANDARAMI REDDY PK

Balakrishna: ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసినా.. బాలయ్య చేసిన సినిమా ఏంటో తెలుసా..?

Balakrishna: ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసినా.. బాలయ్య చేసిన సినిమా ఏంటో తెలుసా..?

‘అఖండ’గా బాలయ్య (Twitter/Photo)

Balakrishna: ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరూ దానిజోలికి కూడా పోరు. కానీ బాలయ్య మాత్రం ఓ సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసినా కూడా చేయాల్సి వచ్చింది.. చేసాడు. నాన్నగారి మాట కాదనలేక అనవసరంగా ఓ డిజాస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య(Balakrishna).

  • Share this:
ఓ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నపుడే కచ్చితంగా దానిమీద ఓ అవగాహన అయితే వచ్చేస్తుంది. దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా ఈ సినిమా వర్కవుట్ అవుతుందా కాదా అనేది అంచనా వేస్తారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఔట్ పుట్ చూసుకుంటే అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిపోతుంది. దానికి సిద్ధపడి ఉంటారు దర్శక నిర్మాతలు.. హీరో కూడా. అయితే కొన్నిసార్లు మాత్రం అంచనాలు తప్పి బాగోలేదేమో అనుకున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. చాలాసార్లు మాత్రం షూటింగ్‌కు ముందే కథల విషయంలో చాలా మంది హీరోలకు జడ్జిమెంట్ వచ్చేస్తుంది.. దర్శకులు చెప్పిన దాన్ని బట్టి అంచనా వేసుకుంటారు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరూ దానిజోలికి కూడా పోరు. కానీ బాలయ్య మాత్రం ఓ సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసినా కూడా చేయాల్సి వచ్చింది.. చేసాడు.. అనుకున్నట్లుగానే ఈ చిత్రం డిజాస్టర్ అయిపోయింది. సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి వరస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో బాలయ్యతో అయిష్టంగానే చేసిన సినిమా తిరగబడ్డ తెలుగుబిడ్డ.

ఈ సినిమాపై దర్శకుడికి కూడా నమ్మకం లేదు.. కథ నచ్చలేదు.. చేయాలనే ఆసక్తి కూడా లేదు.. కానీ ఏం చేస్తాం.. అన్నగారి ఆర్డర్ వేసిన తర్వాత ఎదురు చెప్పలేరు. అసలు విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాలయ్య కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. అలాంటి సమయంలో కోదండరామి రెడ్డి దర్శకత్వంలో అన్నగారు ఓకే చేసిన కథతో బాలయ్య హీరోగా వచ్చిన అనసూయమ్మ గారి అల్లుడు బ్లాక్ బస్టర్ అయింది.

తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా (tiragabadda telugu bidda)
తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా (tiragabadda telugu bidda)


అదే నమ్మకంతో మరో సినిమా కూడా బాలయ్యతో చేయాలని కోదండరామి రెడ్డిని అడగ్గా.. అయ్యో ఎంతమాట అని ఓకే అనేసాడు. అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్న కథ దర్శకుడు కోదండరామిరెడ్డికి అస్సలు నచ్చలేదు.. దాంతో అన్నగారికి కథ నచ్చలేదని.. ఇది చేస్తే ఫ్లాప్ అవుతుందని మొహం మీదే చెప్పేసాడు దర్శకుడు.

తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా (tiragabadda telugu bidda)
తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా (tiragabadda telugu bidda)


మీకు నచ్చనపుడు సినిమా నేనెందుకు చేయమంటాను అంటూ ఎన్టీఆర్ కూడా సైలెంట్ అయిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఎందుకో తెలియదు కానీ ఆ కథతోనే సినిమా చేయాలంటూ చెప్పాక తప్పదని సినిమా చేసాడు కోదండరామి రెడ్డి. అలా పురుడు పోసుకుంది తిరగబడ్డ తెలుగుబిడ్డ. ఈ సినిమా కథ బాలయ్యకు కూడా నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో కోదండరామి రెడ్డి చెప్పాడు. ఇద్దరూ అయిష్టంగానే ఈ సినిమాను పూర్తి చేసారు.

తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా (tiragabadda telugu bidda)
తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా (tiragabadda telugu bidda)


షూటింగ్ సమయంలో కూడా ఓ సీన్ కోసం రెండో టేక్ అడగ్గా.. ఫ్లాప్ అయ్యే సినిమాకు ఎందుకు రెండో టేక్ అంటూ బాలయ్య కూడా అనాసక్తి చూపించాడని చెప్పాడు దర్శకుడు. అనుకున్నట్లుగానే ఈ చిత్రం విడుదలవ్వడం.. డిజాస్టర్ అవ్వడం జరిగిపోయాయి. అయితే ఈ సినిమాలోనే బాలయ్య మొదటిసారి బ్రేక్ డాన్స్ చేసాడు. అలా యిష్టం లేకుండా అన్నగారి మాట కోసం బాలయ్య, కోదండరామిరెడ్డి ఓ సినిమా చేసారన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published: