హోమ్ /వార్తలు /సినిమా /

Balayya : సీనియర్ హీరో బాలయ్య మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందన..

Balayya : సీనియర్ హీరో బాలయ్య మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందన..

Balayya | 2022లో టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. సీనియర్ నటుడు బాలయ్య మరణంపై టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.

Balayya | 2022లో టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. సీనియర్ నటుడు బాలయ్య మరణంపై టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.

Balayya | 2022లో టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. సీనియర్ నటుడు బాలయ్య మరణంపై టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.

  Balayya | 2022లో టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.  ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. రీసెంట్‌గా ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. తాజాగా టాలీవుడ్ సినీయర్ నటుడు బాలయ్య గారు మరణంపై సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.

  ఆయన వయసు 94 యేళ్లు.  హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు బాలయ్య. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు.ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము - శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు.

  RRR 15 Days WW Collections : ఆర్ఆర్ఆర్ వాల్డ్ వైడ్ 15 రోజుల కలెక్షన్స్.. స్టడీగా వసూళ్లు..

  సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు. నాన్న ఎన్టీఆర్ గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా.. కథా రచయతగా బాలయ్య గారు తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చూకూరాలి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ఓ లేఖ విడుదల చేశారు. ఇక బాలకృష్ణ కు బాలయ్య తండ్రిగా ‘సుల్తాన్’, వంశానికొక్కడు’ సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

  బాలయ్య విషయానికొస్తే. ఈయన మంచి నటుడే కాదు.. దర్శకుడు, నిర్మాత, కథా రచయతగా సత్తా చూపెట్టారు.  దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు తెరకెక్కించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. బాలయ్య మరణ వార్త తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు. బాలయ్య గారు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖుల ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

  Rashmika Mandanna : ఆచార్య సహా రష్మిక మందన్న రిజెక్ట్ చేసిన 10 సూపర్ హిట్ సినిమాలు ఇవే..

  బాలయ్య 1930 గుంటూరు జిల్లా చావపాడులో జన్మించారు. ఆయన సతీమణి పేరు మన్నావ కమలాదేవి. బాలయ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ కూతుళ్లు హర్ష లత, మోహిని లత, కుమారుడు తులసి రాం ప్రసాద్. బాలయ్య తల్లిదండ్రులు మన్నావ గురవయ్య, మన్నావ అన్నపూర్ణమ్మ. బాలయ్య చెన్నైలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కాలేజీ రోజుల్లో డ్రామాలపై ఆసక్తి పెరిగి తాపి చాణక్య అనే వ్యక్తి ద్వారా సినిమాల కోసం సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత 300కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణిక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. 2012లో బాలయ్యకు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది.

  telugu actor balaiah passed away
  బాలయ్య ( ఫైల్ ఫోటో)

  శోభన్ బాబు వాణిశ్రీ నటించిన చెల్లెలి కాపురం, సూపర్ కృష్ణ నటించిన నేరం శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త,రజనీకాంత్, శక్తి కపూర్ నటించిన వఫాదార్, పసుపుతాడు వంటి సినిమాలక బాలయ్య స్టోరీ రైటర్‌గా పనిచేశారు. 1981లో ఊరుకిచ్చిన మాట అనే సినిమాకు గాను.. బాలయ్యకు సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్ కింద నంది అవార్డు పురస్కారం లభించింది. కృష్ణం రాజు, జయప్రద నటించిన నిజం చెబితే నేరమా అనే సినిమాతో పాటు పసుపు తాడు,పోలీస్ అల్లుడు సినిమాలకు బాలయ్య దర్శకత్వం వహించారు.

  First published:

  Tags: Balakrishna, Balayya, Tollywood

  ఉత్తమ కథలు