బాలకృష్ణ అభిమాని మరణం.. ఎమోషనల్ అయిన టాప్‌హీరో..

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బాలయ్యను ఎంతగానో అభిమానించే ఫ్యాన్ అకాల మరణం చెందడంతో బాలకృష్ణ ఒకింత భావోద్వేగానికి లోనైయ్యాడు.

news18-telugu
Updated: October 18, 2019, 3:37 PM IST
బాలకృష్ణ అభిమాని మరణం.. ఎమోషనల్ అయిన టాప్‌హీరో..
బాలయ్య అభిమాని గోకుల్ (Facebook/Photo)
  • Share this:
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆయన్ని అభిమానించే చిన్నారి అభిమాని గోకుల్.. డెంగ్యూ కారణంగా కన్నుమూసాడు. తెలుగులో జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్ కార్యక్రమంలో అచ్చంగా బాలకృష్ణలా గోకుల్ చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఎంతో ఫిదా అయ్యారు. గోకుల్ డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో కన్నుమూసాడు. గతంలో గోకుల్ తన అభిమాన నటుడు బాలకృష్ణను కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. చిన్నారి గోకుల్ మరణంతో బాలయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా తన బాధను అభిమానులతో పంచుకున్నారు.

nandamuri balakrishna deep condolence to his children fan gokul sudden death,nandamuri balakrishna,balayya,bala,balakrishna deep condelence to his fan gokul death,balakrishna fan death,nandamuri balakrishna deep condolence,nandamuri balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,balakrishna ruler movie,balakrishna movie updates,balakrishna roja,balakrishna tdp mla,tollywood,telugu cinema,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలయ్య,అభిమాని మరణంపై బాలయ్య భావోద్వేగం,చిన్నారి అభిమాని గోకుల్ మరణంపై బాలకృష్ణ సంతాపం,అభిమాని మరణంపై బాలయ్య సంతాపం,బాలకృష్ణ సంతాపం,బాలయ్య సంతాపం,బాలకృష్ణ రూలర్,రూలర్,బాలయ్య రూలర్
బాలయ్య అభిమాని గోకుల్ (Facebook/Photo)


నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలిచివేసింది. ఆ చిన్నారి డైలాగులు చెప్పే విధానం.. హావభావాలు చూసి నాకు ఎంత ముచ్చటేసిది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ లేఖ విడుదల చేసారు. గోకుల్ విషయానికొస్తే.. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు,తల్లి సుమాంజలి. మొదటి నుంచి బాలకృష్ణలా డైలాగులు చెబుతూ ఇంటి పక్కనవారిని అలరిస్తూ అలా టీవీల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 18, 2019, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading