డైరెక్ట‌ర్‌కు బాలయ్య షరతు... అలా అయితేనే షూటింగ్‌కి వస్తా.. అంటూ అల్టిమేటం

నందమూరి బాలకృష్ణ నటించిన 'రౌడీ ఇన్స్పెక్టర్' తెలుగులో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అన్న విషయం తెలిసిందే. ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆరోజుల్లో మాస్‌ను ఓ ఊపు ఊపేసింది ఈ సినిమా.

news18-telugu
Updated: July 22, 2019, 11:28 AM IST
డైరెక్ట‌ర్‌కు బాలయ్య షరతు... అలా అయితేనే షూటింగ్‌కి వస్తా.. అంటూ అల్టిమేటం
బాలయ్య (ఫైల్ ఫోటో)
  • Share this:
నందమూరి బాలకృష్ణ నటించిన 'రౌడీ ఇన్స్పెక్టర్' తెలుగులో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అన్న విషయం తెలిసిందే. ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆరోజుల్లో  మాస్‌ను ఓ ఊపు ఊపేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ సినిమా అప్పట్లో బద్దలు కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ ప్రాణం పెట్టాడట. నిజ జీవితంలో పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు... జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన రావాడానికి చాలా హోమ్ వర్కే చేసాడట బాలయ్య. అంతేకాదు ఈ సినిమా చిత్రీకరణ సమయలో డైరెక్టర్ బి. గోపాల్ ను కూడా ఇబ్బంది పెట్టాడట బాలయ్య. అదేంటి బాలయ్య దర్శకుడిని ఇబ్బంది పెట్టడమా.. అనుకుంటున్నారా ఆ కండిషన్ వింటే మీకు కూడా బాలకృష్ణకు నటన మీద ఉన్న ప్యాషన్‌ ఏంటో అర్ధం అవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ గోపాల్‌కు ఓ రోజు ఉదయం బాలయ్య ఫోన్‌ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదన్నారు. ఏమైంది బాబూ అనడిగితే.. సినిమాలో నేను వాడుతున్న జీపును పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా అని.. అప్పుడే ఆ పాత్రలో లీనమవ్వగలను అని దర్శకునితో చెప్పాడట బాలయ్య.

రౌడీ ఇన్‌స్పెక్టర్ పోస్టర్ Photo : Youtube
రౌడీ ఇన్‌స్పెక్టర్ పోస్టర్ Photo : Youtube


దీంతో గోపాల్, బాలయ్య అడిగిన విదంగానే జీపు పంపించాడట. దీంతో ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య..  ఆ రోజు నుంచి... పోలీసు జీపులో అచ్చం పోలీసులా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చేవాడట. బాలయ్యకు సినిమా అంటే అంత ప్యాషన్‌..అంటూ ఓ సందర్బంగా బాలయ్య కు నటనపై గల ప్యాషన్‌ను  గుర్తుచేసుకున్నారు దర్శకులు బి.గోపాల్.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు