హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna: ఓ సారి నీ కాళ్ళు పైకెత్తరా.. దండంపెడతా! బాలకృష్ణ వీడియో వైరల్

Balakrishna: ఓ సారి నీ కాళ్ళు పైకెత్తరా.. దండంపెడతా! బాలకృష్ణ వీడియో వైరల్

Balakrishna (Photo Twitter)

Balakrishna (Photo Twitter)

Nandamuri Balakrishna Viral Video: సప్తగిరితో ఓ ఫన్నీ టాస్క్ చేశారు బాలయ్య. సప్తగిరితో కలిసి భారీ డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ సీనియర్ హీరో, పొలిటీషియన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూటే సపరేటు. అందరు హీరోల్లో కెల్లా ఆయన వ్యక్తిత్వమే డిఫరెంట్. పెద్దింటి ఫ్యామిలీ మెంబర్ పైగా కోట్లాది మంది అభిమాన వర్గం ఉన్నా బాలయ్య బాబుకి కొంచమైనా గ్రావం ఉండదు. సినిమా సెట్స్ పై తోటి నేటీనటులతో బాలకృష్ణ ఉండే విధానం అందరికీ నచుతుంది. పని వాతావరణంలో చిన్న పిల్లాడిలా మారిపోయి అందరితో కూడా ఎంతో చనువుగా ఉంటూ ఫన్నీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంటారు బాలయ్య బాబు. తాజాగా తన NBK 107 సెట్స్‌పై అదే చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

మొన్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు NBK 107 సెట్స్‌పై జరగగా.. ఇందులో సప్తగిరి (Sapthagiri) కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సప్తగిరితో ఓ ఫన్నీ టాస్క్ చేశారు బాలయ్య. సప్తగిరితో కలిసి భారీ డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించారు బాలయ్య బాబు. అయితే మధ్యలోనే బాలయ్య ఆపడం, దాన్ని సప్తగిరి కంటిన్యూ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో ఫిదా అయిపోయిన బాలయ్య.. ఫన్నీగా సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ట్రై చేయడం హైలైట్ అయింది.

భారీ డైలాగ్ చెప్పిన అనంతరం సప్తగిరి నవ్వుకుంటూ మొదట బాలయ్య కాళ్ల మీద పడబోయాడు. దీంతో 'ఓసారి.. నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా' అని బాలకృష్ణ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జై బాలయ్య అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఊరమాస్ లుక్ సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ హంట్ రుజువు చేశాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఇటీవలే ఫన్ అండ్ ఎంటర్ టైనింగ్ నేపథ్యంలో ఎఫ్3 సినిమాతో ఫన్ కిక్కిచిన అనిల్ రావిపూడితో బాలయ్య కొత్త సినిమా ఉంటుందని ప్రకటించడం నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది.

Published by:Sunil Boddula
First published:

Tags: Gopichand malineni, Nandamuri balakrishna, NBK 107, Tollywood actor

ఉత్తమ కథలు