ఈ యేడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. త్వరలో ‘రూలర్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమ ాప్రారంభమైంది. ఈ సినిమాకు బి.గోపాల్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేసారు.
ఈ సందర్భంగా నువ్వొక మాటంటే అది శబ్ధం... అదే మాట నేనంటే అది శాసనం అంటూ బాలయ్య డైలాగు చెప్పాడు. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. 2020 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈసినిమాలో బాలకృష్ణ సనసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటించే అవకాశాలున్నాయి. ఇంకోవైపు ఈ చిత్రంలో రోజా కూడా పవర్ ఫుల్ పాత్రకోసం సంప్రదించారు. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.మరి ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తోన్న బాలకృష్ణ,బోయపాటి శ్రీను ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Boyapati Srinu, K. S. Ravikumar, NBK, NBK 105, NBK 106, Ruler