హోమ్ /వార్తలు /సినిమా /

సినీ కెరీర్‌లో మొదటిసారి అలా చేయబోతున్న బాలకృష్ణ..

సినీ కెరీర్‌లో మొదటిసారి అలా చేయబోతున్న బాలకృష్ణ..

బాలకృష్ణ (Photo/Special Arrangement)

బాలకృష్ణ (Photo/Special Arrangement)

45 ఏళ్ల సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ మొదటిసారి అలా చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే...

  45 ఏళ్ల సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ మొదటిసారి అలా చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ టైటిల్ కోసం బాలయ్య, బోయపాటి శ్రీను దిల్ రాజుతో మాట్లాడినట్టు సమాచారం. ఈ సినిమాను బోయపాటి శ్రీను తనదైన స్టైల్‌లో మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత వీళ్లిద్దరి కలయిలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ముందుగా సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రీసెంట్‌గా వెంకటేష్, తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమాను తన పుట్టినరోజున విడుదల చేసాడు. వెంకటేష్ బర్త్ డే రోజున విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది.

  45 ఏళ్ల సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ మొదటిసారి అలా చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే...
  బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభం (Twitter/Photo)

  ఇపుడు అదే రూట్లో బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను జూన్ 10న తన పుట్టినరోజున విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు పుట్టినరోజుకు అటు ఇటుగా బాలయ్య సినిమాలు రిలీజైనా.. ఆయన ఏ బర్త్ డే రోజున ఏ సినిమా విడుదల కాలేదు. ఇపుడా లోటును బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాతో తీర్చుకోవాలనుకుంటున్నారు బాలయ్య. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Boyapati Srinu, NBK 106, Ruler, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు