హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎపుడంటే..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎపుడంటే..

బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభం (Twitter/Photo)

బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభం (Twitter/Photo)

ఈ యేడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. తాజాగా ‘రూలర్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకుళ్లే తేది ఫిక్స్ అయింది.

ఇంకా చదవండి ...

  ఈ యేడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. తాజాగా ‘రూలర్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 3 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా మే నెలలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను అనుకుంటున్నారు. ఆయన ఈ చిత్రం అంగీకరించింది లేనిది తెలియదు. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన కేథరిన్ థెరిసాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

  45 ఏళ్ల సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ మొదటిసారి అలా చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే...
  బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభోత్సవం (Twitter/Photo)

  ఇక ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో శ్రీకాంత్ అనుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా నటించిన శ్రీకాంత్.. నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ సినిమాలో విలన్‌గా మెరిసాడు. ఇపుడు బోయపాటి శ్రీను చిత్రంలో మరోసారి పూర్తిస్థాయి విలన్‌గా కనిపించనున్నట్టు సమాచారం. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం బాలయ్య, బోయపాటి శ్రీను హాట్రిక్ హిట్ సాధిస్తారా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Boyapati Srinu, Catherine tresa, NBK 106, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు