Home /News /movies /

AKhanda Twitter Review: అఖండ మూవీ ట్విటర్ రివ్యూ.. బాలయ్య శివతాండవం.. థియేటర్స్‌లో పూనకాలే

AKhanda Twitter Review: అఖండ మూవీ ట్విటర్ రివ్యూ.. బాలయ్య శివతాండవం.. థియేటర్స్‌లో పూనకాలే

‘అఖండ’ మూవీ (Twitter/Photo)

‘అఖండ’ మూవీ (Twitter/Photo)

Akhanda Twitter Review: అఖండ మూవీలో బాలయ్య శివతాండవం చేశారని.. థియేటర్లలో ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోతున్నారని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇది హైఓల్టేజ్ డ్రామా అని.. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెబుతున్నారు.

    బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులకు అసలు సిసలైన పండగ రోజు ఇది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ (Akhanda movie) మూవీ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలయింది. బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడం.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో.. అఖండపై భారీగానే అంచనాలున్నాయి. అంతేకాదు బాలయ్య ఫస్ట్ లుక్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌ వరకు.. అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. గత రాత్రి ఈ సినిమా ఓవర్‌సీస్‌లో విడుదలయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలుచోట్ల ప్రివ్యూ వేశారు. మరి అఖండ సినిమా ఎలా ఉంది? అభిమానుల అంచనాలను అందుకుందా? బాలయ్య, బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడిందా?

    AP Government Vs Tollywood: సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన దర్శకేంద్రుడు..

    పలువురు ఆడియన్స్ ఇప్పటికే సినిమా చూసి.. ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను (Akhanda twitter review) వ్యక్తం చేశారు. బాలయ్య వన్ మ్యాన్ షో అని నెటిజెన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. మంచి మాస్ మసాలా సినిమా అందించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. అఖండ మూవీలో బాలయ్య శివతాండవం చేశారని..  థియేటర్లలో ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోతున్నారని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇది హైఓల్టేజ్  డ్రామా అని.. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెబుతున్నారు. రొటీన్ స్టోరీయే ఐనప్పటికీ.. ఈ మూవీలో బాలయ్య పాత్రలను బోయపాటి శీను అద్భుతంగా తీర్చిదిద్ది, స్క్రీన్ ప్లేతో ఉర్రూతలూగించారని నెటిజన్ల పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్‌లు థియేటర్లలో విజిల్స్ మోత మోగిస్తాయని టాక్ వినిపిస్తోంది. ఐతే శ్రీకాంత్ పాత్ర మాత్రం అంచనాలను అందుకోలేదని... ఓవరల్‌గా బొమ్మ దద్ధరిల్లిపోయిందని అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

    మహేష్ బాబుకు సర్జరీ.. సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్..

    అఖండ సినిమాపై ట్విటర్‌లో నెటిజన్ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.















    కాగా, బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అఖండతో హ్యాట్రిక్ సాధించారని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించింది. పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు, సాయికుమార్, సుబ్బరాజు ఇతర పాత్రల్లో నటించారు. తమన్ మ్యూజిక్ అందించగా.. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Akhanda, Akhanda movie, Akhanda Movie Review, Balayya, Nandamuri balakrishna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు