NANDAMURI BALAKRISHNA BOYAPATI SREENU AKHANDA 100 DAYS SPECIAL TRAILER RELEASED TA
Akhanda 100 Days Trailer : బాలకృష్ణ ‘అఖండ’ 100 రోజుల స్పెషల్ ట్రైలర్ విడుదల..
నందమూరి బాలకృష్ణ (Twittter/Photo)
Balakrishna - Akhanda 100 Days Trailer | నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. తాజాగా ఈ సినిమా శతదినోత్సవ వేడుకల కర్నూలులో అట్టహాసంగా నిర్వహించారు.
Balakrishna - Akhanda 100 Days Trailer | నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా STBC గ్రౌండ్స్ కర్నూలులో ఈ సినిమా కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు హీరో బాలయ్యతో పాటు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్ తదితరులు విచ్చేసారు.
ఈ సినిమా విజయవంతంగా 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ఫంక్షన్‌కు బాలయ్య అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 100 రోజుల సందర్భంగా స్పెషల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Presenting you the #Akhanda 🦁 Roaring 1⃣0⃣0⃣Days Trailer🔥
50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో మూడు వారాలు ఆడిందంటే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ‘అఖండ’ 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. అది ఓ రికార్డు అనుకుంటే.. ఇపుడీ సినిమా ఏకంగా శనివారంతో సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. తాజాగా ఈ సినిమా 20 థియేటర్స్‌లో 100 రోజుల పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమ ాప్రపంచ వ్యాప్తంగా రూ. 95.55 కోట్ల షేర్.. రూ. 106 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య చిత్రాలకు ఎక్కువ వసూళ్లు ఈ ఏరియాల్లోంచే వస్తుంటాయి. ఈ ఏరియాలోని బాలయ్య సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటాయి. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ సినిమా కడప, కర్నూలు జిల్లా సెంటర్స్‌లో 400 రోజులు పైగా ఆడింది. కడపలో ఓ సెంటర్లో 1000 రోజులు పైగా ప్రదర్శించబడింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు ఈ రికార్డు లేదు. తాజాగా బాలయ్య ‘అఖండ’ సినిమా ఎమ్మిగనూరులో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సెంటర్లో బాలయ్య సినిమాలు ఏకంగా 11 సినిమాలు డైరెక్ట్‌గా 4 షోలతో కంటిన్యూ 100 రోజులుగా పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.