అఖండ సినిమా బంపర్ హిట్.. అన్ స్టాపబుల్ టాక్ షోకు స్టన్నింగ్ వ్యూస్‌తో మంచి జోరుమీదున్న నట సింహం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈఏడాది సంక్రాంతి సంబురాల (sankranti celebrations)ను ఓ రేంజ్లో జరుపుకొంటున్నారు. భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞతో కలసి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారాయన. కారంచేడులోని తన సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో బాలయ్య ఫ్యామిలీ పండుగ జరుపుకొంటున్నది. ఈక్రమంలోనే వరుస కార్యక్రమాల్లో బాలయ్య సందడి చేశారు..
సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం నాటి భోగి వేడుకల్లో గుర్రపుస్వారీ చేసిన బాలయ్య.. శనివారం సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు. తాజాగా బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. టాప్ లెస్ ఫోర్డ్ జీప్‌లో తన భార్య వసుందరను పక్కన కూర్చోపెట్టుకొని స్వయానా బాలకృష్ణ బీచ్ వద్ద జీపు నడిపారు.
జాలీరైడ్ బయలుదేరడానికి ముందు వసుంధర కెమెరాకు టాలా చెప్పడం.. బయటున్న బంధువులు సముద్రంలోకి పోవద్దని వారించడంతో.. ‘చెయ్ ఇలా ఊపితే(టాటా చెబితే) దబిడి దిబిడే(బండి సముద్రంలోకే) అన్నట్లు, కాబట్టి ఇలా చెప్పు(థమ్స్అప్) అని భార్యకు బాలయ్య సూచించారు. అతరం కుటుంబ సభ్యులతో బీచ్‌లో కొద్దిసేపు గడిపారు.
శుక్రవారం బాలయ్య గుర్రంపై స్వారీ అందరినీ ఆకట్టుకుంది. గుర్రంతో బాలయ్య డ్యాన్స్ వేయించిన తీరు హైలెట్‌గా నిలిచింది. ఓ పాటను పాడుతూ, డ్రమ్స్ వాయిస్తుండగా.. ఆ గుర్రం లయబద్ధంగా స్టెప్పులు వేసింది. ఇక, గుర్రంపై బాలయ్య ఫుల్ జోష్‌తో కనిపించారు. ఓ వైపు బాలయ్యను కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండగా, మరోవైపు.. అభిమానులు కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు.
తర్వాత, అదే గుర్రంపైకి బాలయ్య వారసుడు నందమూరి మోక్షాజ్ఞ ఎక్కి స్వారీ చేశారు. ఒకే ఫ్రేంలో తండ్రీకొడుకులను చూసిన స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాలయ్య సతీమణితో పాటు.. ఆయన కుమారుడు మోక్షాజ్ఞ కూడా కారంచేడులోని మేనత్త ఇంట్లో ఆనందంగా గడుపుతున్నారు. మొత్తంగా దగ్గుబాటి వారి ఇల్లు.. నందమూరి కుటుంబ సభ్యుల రాకతో సంక్రాతి వేళ సందడిగా మారిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balayya, Chirala, Nandamuri balakrishna, Sankranti