మరోసారి ఆహా వేదికపై బాలయ్య బాబు.. ఆ సందడి మాటల్లో చెప్పలేం అంటున్నారే!
Photo Twitter
Aha: ఆహా ఓటీటీ వేదికపై ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ షో భారీ స్పందన తెచ్చుకుంది. ఆన్ లైన్ మాద్యమాలపై బాలయ్య బాబు హుషారు చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ షో ముగిశాక మళ్ళీ బాలకృష్ణ ఎప్పుడు ఓటీటీపై సందడి చేస్తారని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆ క్షణం మళ్ళీ రాబోతోందంటూ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది ఆహా యాజమాన్యం.
సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అనే టాక్ షో చేసి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నారు. ఆహా ఓటీటీ (Aha Ott) వేదికపై ప్రసారమైన ఈ షో భారీ స్పందన తెచ్చుకుంది. ఆన్ లైన్ మాద్యమాలపై బాలయ్య బాబు హుషారు చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ షో ముగిశాక మళ్ళీ బాలకృష్ణ ఎప్పుడు ఓటీటీపై సందడి చేస్తారని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆ క్షణం మళ్ళీ రాబోతోందంటూ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది ఆహా యాజమాన్యం. ఈ మేరకు ఆహా అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి? మళ్ళీ బాలయ్య బాబును ఎలా చూడబోతున్నామో ఆ వివరాలు చూస్తే..
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంపై తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) అనే షోకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడంతో స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసిన ఆహా యూనిట్.. బాలయ్య బాబును చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. జూన్ 10న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ను మరింత స్పెషల్‌గా ఉండనుందట. ఈ మేరకు ఏదైనా ఆయన దిగనంత వరకే అంటూ ట్విట్టర్లో ఈ ఎపిసోడ్ తాలూకు కొన్ని ఫొటోస్ షేర్ చేసి షో పట్ల ఆసక్తి రేకెత్తించారు.
ఈ షోలో ఓ అదిరిపోయే సాంగ్‌కు డ్యాన్స్ చేసి హుషారెత్తించారట బాలకృష్ణ. ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోకు శ్రీరామ చంద్ర హోస్ట్‌గా చేస్తుండగా.. థమన్, నిత్యా మీనన్, కార్తీక్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఆహా పోస్ట్ చేసిన తాజా ట్వీట్‌తో జూన్ 10న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ షో పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
You guessed it right... Edaina aayana diganantha varake, once he steps in Entertainment doubles 💥
ఇటీవలే బోయపాటి శ్రీను (Boayapati Srinu) దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాతో భారీ సక్సెస్ అందుకొని ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాలకృష్ణ.. తన నెక్ట్స్ మూవీని మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్లో చేస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు బాలకృష్ణ. మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంపై ‘అన్‌స్టాపబుల్’ రెండో పార్ట్ కోసం ఆయన రెడీ అవుతున్నట్లు సమాచారం.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.