నందమూరి బాలకృష్ణకు మన ఇతిహాసాలు, రామాయణ, మహాభారతాల మీద ఎంతగా పట్టు ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి బాలయ్య ఓ చిన్న తప్పు చేశాడు. వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణుల గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణ బ్రహ్మ అని అన్నాడు. దీంతో ఆ వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర తెలియకుండా మాట్లాడొద్దని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో బాలయ్య కాస్త వెనక్కి తగ్గాడు. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను.. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు.. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అని బాలయ్య వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు.
యంగ్ హీరోలకు పోటీనిస్తూ మాస్ యాక్షన్ సినిమాలతో అభిమాన వర్గాల్లో పూనకాలు తెప్పిస్తున్నారు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఇటీవలే అఖండ (Akhanda) సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకొని రికార్డులు తిరగరాసిన బాలయ్య బాబు.. ఇప్పుడు వీర సింహా రెడ్డిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది.
మాస్ అభిమానుల చేత గోల పెట్టించే సత్తా ఉన్న గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) చేతులు కలిపిన నటసింహం.. వీర సింహారెడ్డిగా నట విశ్వరూపం చూపించారు. వెండితెరపై బాలయ్య రోషం, పౌరుషం చూసి నందమూరి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. విడుదలైన తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా సంక్రాంతి పందెం కోడిగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పటినుంచే నందమూరి ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. విడుదల తర్వాత నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న అన్ని ఎలిమెంట్స్ ఇందులో చూసి ఫిదా అయ్యారంతా. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.