Home /News /movies /

NANDAMURI BALAKRISHNA ANIL RAVIPUDI NBK108 TITLE LEAK SLB

NBK108 టైటిల్ ఇదే.. ఇక బాలయ్య అభిమానులకు పూనకాలే!!

Photo Twitter

Photo Twitter

Balakrishna- Anil Ravipudi: నందమూరి బాలకృష్ణ తాను చేయబోతున్న కొత్త సినిమాపై అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ పేరు తెగ వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday) రోజు నందమూరి అభిమానులకు ఓ తీపి కబురు చెప్పారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాను చేయబోతున్న కొత్త సినిమాపై అఫీషియల్ స్టేట్ మెంట్ ఇస్తూ బాలయ్య బాబుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ సినిమాను NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ పేరు తెగ వైరల్ అవుతోంది. NBK108 కి సంబంధింది తదుపరి అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు ఈ టైటిల్ పూనకాలు తెప్పిస్తోందట.

ఇంతకీ ఈ NBK108 టైటిల్ ఏంటంటారా? పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తనడైన మార్క్ కామెడీ జోడిస్తూ ఈ సినిమాను రూపొందించబోతున్న అనిల్ రావిపూడి ఇప్పటికే కొన్ని టైటిల్స్ పరిశీలనలోకి తీసుకొని చివరకు 'బ్రో ఐ డోంట్ కేర్' (Bro I dont care) అనే టైటిల్ లాక్ చేయాలని ఫిక్సయినట్లు సమాచారం. తాను రాసుకున్న కథ ప్రకారం ఇదే టైటిల్ సరిగ్గా యాప్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట.

ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య బాబు 40 ఏళ్ళ వయసులో కనిపిస్తాడని సమాచారం. అలాగే పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటిస్తుందని అంటున్నారు. తనదైన స్టైల్ కామెడీ టచ్ ఇస్తూ మాస్ కిక్కిచ్చేలా ఈ సినిమా కోసం కథ సిద్దం చేసుకుంటున్నారట అనిల్ రావిపూడి. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఊరమాస్ లుక్ సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ హంట్ రుజువు చేశాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఇటీవలే ఫన్ అండ్ ఎంటర్ టైనింగ్ నేపథ్యంలో ఎఫ్3 సినిమాతో ఫన్ కిక్కిచిన అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రకటించడం నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. సో.. చూడాలి మరి ఈ సినిమాలో బాలయ్య బాబును ఎలా చుపిస్తారనేది!.
Published by:Sunil Boddula
First published:

Tags: Nandamuri balakrishna

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు