హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood: సినీ నటుడు తారకరత్న పెద్దకర్మ నేడు ..వైసీపీ, టీడీపీలోని ఆ ఇద్దరు కీలక నేతలే ఆహ్వానితులు

Tollywood: సినీ నటుడు తారకరత్న పెద్దకర్మ నేడు ..వైసీపీ, టీడీపీలోని ఆ ఇద్దరు కీలక నేతలే ఆహ్వానితులు

Balakrishna,Vijaysaireddy

Balakrishna,Vijaysaireddy

Hyderabad: సినీ నటుడు తారకరత్న పెద్దఖర్మ ఈరోజు ఉంది. అయితే ఈరోజు నిర్వహించే కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. నందమూరి వారసుడిగా తెరంగేట్రం చేసిన తారకరత్న మరణానంతరం ఆయన ఫ్యామిలీకి రెండు పొలిటికల్ ఫ్యామిలీలు సపోర్ట్‌గా నిలిచాయి. చివరకు ఈ పెద్దఖర్మకు ఆహ్వానిస్తుంది కూడా ఆ ఇద్దరు పెద్ద మనుషులే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సినీ నటుడు నందమూరి తారకరత్న పెద్దఖర్మ ఇవాళ జరుగనుంది.గుండె పోటుతో తారకరత్న(Tarakaratna)గత నెలలో మరణించాడు. అప్పటి వరకు ఆయనకు కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవు. అయితే ఆయన మరణానంతరం పరిణామాలు మారిపోయాయి. తారకరత్న నందమూరి ఫ్యామిలీతో పాటు టీడీపీ చెందిన వ్యక్తి కావడమే ఇందుకు ప్రధాన కారణం. అంతే కాదు ఆయన సతీమణి అలేఖ్యరెడ్డి వైసీపీలోని కీలక నేతగా ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaya sai reddy)దగ్గరి బంధువు కావడంతో అప్పటి వరకు భిన్నదృవాలుగా ఉన్న విజయసాయిరెడ్డి(Vijaya sai reddy),చంద్రబాబు (Chandrababu) తారకరత్న ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇప్పుడు పెద్దఖర్మను కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు. తారకరత్న భార్య తరపున వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెద్దగా వ్యవహరిస్తుంటే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)తారకరత్న తరపున నిలబడ్డారు.

వాళ్లిద్దరే పెద్దలు ..

తారకరత్న మరణానంతరం విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ కలుస్తారనే విషయం రెండు కుటుంబాల పరంగా ప్రధాన్యత లేకపోయినప్పటికి ..రాజకీయంగా మాత్రం పెద్ద చర్చకు దారి తీస్తోంది. తన బంధువు కోసం నందమూరి ఫ్యామిలీతో సాన్నిహిత్యం పెంచుకున్న విజయసాయిరెడ్డి ఈ రిలేషన్‌ను ఇలాగే కొనసాగిస్తారా లేక కార్యక్రమం తర్వాత తన పని తాను చేసుకుపోతారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్ క్లబ్‌లో జరిగే ఈకార్యక్రమానికి రావాలంటూ ఆహ్వాన పత్రికలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్లు మాత్రమే ఉండటంపై అనేక ప్రశ్నలు, సందేహాలు అటు టీడీపీ శ్రేణుల్లో ..ఇటు వైసీపీ వర్గాల్లో కలుగుతున్నాయి.

రెండు పార్టీల కీలక నేతలు..

తారకరత్న ప్రేమ పెళ్లిని అంగీకరించని నందమూరి ఫ్యామిలీ..అతని మరణం తర్వాత భార్య బిడ్డలను తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటామని బాలకృష్ణ చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు పెద్ద కర్మ కూడా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి లు ఇద్దరూ కలిపి చేస్తూ ఉండటం పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం అని చెప్పడమే. రాజకీయ విభేదాలు ఎన్ని వున్నా, తన కుటుంబం, తన మనుషుల కోసం ఇలా ఇద్దరూ కలవటం ఒక శుభ పరిణామంగానే చూస్తున్నారు.

First published:

Tags: Nandamuri balakrishna, Taraka Ratna, Tollywood actor, Vijayasai reddy

ఉత్తమ కథలు