బోయపాటి శ్రీనుకు అల్లు అర్జున్, బాలయ్య పరామర్శ..

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ప్రముఖుల పరామర్శ కొనసాగుతుంది. ఈయన తల్లి సీతారావమ్మ వారం రోజుల కింద కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె స్వగృహంలోనే మరణించారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2020, 8:19 PM IST
బోయపాటి శ్రీనుకు అల్లు అర్జున్, బాలయ్య పరామర్శ..
బోయపాటిని పరామర్శిస్తున్న ప్రముఖులు
  • Share this:
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ప్రముఖుల పరామర్శ కొనసాగుతుంది. ఈయన తల్లి సీతారావమ్మ వారం రోజుల కింద కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె స్వగృహంలోనే మరణించారు. కాగా అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు వచ్చి బోయపాటికి తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య ముందు వచ్చారు. ఇక జనవరి 23 అల్లు అర్జున్ వచ్చి బోయపాటిని పలకరించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని బోయపాటి నివాసానికి అల్లు అర్జున్ వచ్చాడు. అక్కడే బోయపాటితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసిన బన్నీ వాళ్లకు ధైర్యం చెప్పారు. సీతారావమ్మ ఆత్మకు శాంతి కలగాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు సినిమా బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు